ETV Bharat / international

స్పుత్నిక్​ లైట్​ పేరుతో కొత్త టీకా- ఒక్క​ డోస్​తోనే రక్ష! - sputnik light vaccine

sputnik light vaccine
స్పుత్నిక్​ లైట్​
author img

By

Published : May 6, 2021, 6:04 PM IST

Updated : May 7, 2021, 7:34 AM IST

18:01 May 06

స్పుత్నిక్​ లైట్​ పేరుతో కొత్త టీకా- సింగిల్​ డోస్​తోనే రక్ష!

sputnik light vaccine
స్పుత్నిక్​ లైట్​ టీకా విశేషాలు

రష్యా సంస్థ ఆర్‌డీఐఎఫ్‌ (రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌) కొవిడ్‌-19 టీకా ఆవిష్కరణలో మరో మైలురాయిని చేరుకుంది. రెండు డోసుల 'స్పుత్నిక్‌ వి' టీకాను అభివృద్ధి చేసిన ఈ సంస్థ, తాజాగా ఒకే డోసు 'స్పుత్నిక్‌ లైట్‌' టీకాను రూపొందించింది. దీనికి రష్యాలో అత్యవసర అనుమతి లభించింది. కొవిడ్‌-19ను అదుపు చేయడంలో ఒకే డోసు టీకా 79.4% ప్రభావశీలత కనబరచినట్లు ఆర్‌డీఐఎఫ్‌ పేర్కొంది. 

ఈ టీకా తీసుకున్న వారిలో 28 రోజుల నాటికి వైరస్‌ను ఎదిరించే యాంటీ-బాడీలు తయారవుతున్నట్లు గుర్తించారు. ఇది కరోనా వైరస్‌ నూతన వేరియెంట్ల పైనా పనిచేస్తోందని సంస్థ వివరించింది. రష్యా, యూఏఈ, ఘనా, మరికొన్ని దేశాల్లో దీనిపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయని, దాదాపు 7,000 మంది వాలంటీర్లు ఇందులో పాల్గొంటున్నారని ఆర్‌డీఐఎఫ్‌ పేర్కొంది. ఈ పరీక్షల మధ్యంతర సమాచారం ఈ నెలాఖరు నాటికి వెలుగులోకి వస్తుందని అంచనా. వివిధ దేశాల్లో కొవిడ్‌-19 తీవ్రత దృష్ట్యా ప్రజలకు తక్కువ సమయంలో ఎక్కువ మందికి టీకా ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోందని, దీనికి ఒకే డోసు టీకా మంచి పరిష్కారమని ఆర్‌డీఐఎఫ్‌ హెడ్‌ కిరిల్‌ డిమిట్రివ్‌ వివరించారు. అదే సమయంలో రెండు డోసుల 'స్పుత్నిక్‌ వి' టీకాను కొనసాగిస్తామని తెలిపారు.

స్పుత్నిక్‌ వి పై పరీక్షల నిర్వహణకు హెటెరో బయోఫార్మాకు అనుమతి

మనదేశంలో 'స్పుత్నిక్‌ వి' టీకా తయారు చేయడానికి ముందస్తుగా దానిపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి హెటెరో బయోఫార్మా సన్నద్ధమవుతోంది. మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి హెటెరో బయోఫార్మాకు అనుమతి ఇవ్వాలని భారత ఔషధ నియంత్రణ మండలికి చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) సిఫార్సు చేసింది. ఏప్రిల్‌ చివరి వారంలో జరిగిన ఎస్‌ఈసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మనదేశంలో 'స్పుత్నిక్‌ వి' టీకా పంపిణీకి ఆర్‌డీఐఎఫ్‌, హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఈ టీకాపై డాక్టర్‌ రెడ్డీస్‌ అన్ని దశల క్లినికల్‌ పరీక్షలు నిర్వహించి, టీకా పంపిణీకి అనుమతి సంపాదించింది. దీనికి అనుగుణంగా ఆర్‌డీఐఎఫ్‌ రష్యా నుంచి కొన్ని డోసుల టీకాను నేరుగా మనదేశానికి తీసుకువచ్చి డాక్టర్‌ రెడ్డీస్‌కు అందించింది. ఈ టీకా త్వరలో మనదేశంలో పంపిణీ కానుంది.

ఆరు కంపెనీలతో తయారీ ఒప్పందాలు

స్పుత్నిక్‌ వి టీకా తయారీకి ఆర్‌డీఐఎఫ్‌ మనదేశానికి చెందిన 6 ఔషధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో హెటెరో బయో ఫార్మా ఒకటి. నిబంధనల ప్రకారం ఈ టీకాను మనదేశంలో ఉత్పత్తి చేయడానికి ముందుకు వచ్చే సంస్థ, దానిపై మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించి, ఆ సమాచారాన్ని భారత ఔషధ నియంత్రణ మండలికి సమర్పించాల్సి ఉంటుంది. తదుపరి అనుమతి లభించాకే ఉత్పత్తి  చేపట్టాలి. క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు అనుమతి లభించినందున వెంటనే ఈ ప్రక్రియ పూర్తిచేసి టీకా అందించడానికి హెటెరో బయోఫార్మా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆర్‌డీఐఎఫ్‌ మనదేశంలో స్పుత్నిక్‌ వి టీకా ఉత్పత్తి ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీల్లో గ్లాండ్‌ ఫార్మా, విర్కో బయోటెక్‌, స్టెలిస్‌ బయో, పానేషియా బయోటెక్‌, శిల్ప మెడికేర్‌ ఉన్నాయి.

Last Updated : May 7, 2021, 7:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.