ETV Bharat / international

కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక రోబో

కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సింగపూర్​ ఓ వినూత్న రోబోను రూపొందించింది. కరోనా పరీక్షల్లో ఆరోగ్య సిబ్బందిని పరిమితంగా వినియోగించడంమే కాక ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కొరతను అధిగమించే లక్ష్యంతో దీన్ని అభివృద్ధి చేసింది. ఇకపై ‘స్వాబోట్‌’తోనే స్వాబ్‌ టెస్ట్‌లు నిర్వహించనున్నారు.

Special robot
కరోనా పరీక్షలు
author img

By

Published : Sep 22, 2020, 6:42 AM IST

ప్రపంచ దేశాలను కరోనా భయం వెంటాడుతోంది. లక్షలాది మంది ప్రాణాల్ని బలిగొన్న ఈ రక్కసిపై పోరులో ముందువరుసలో నిలబడి పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందినీ వదలడంలేదు. ఈ నేపథ్యంలో సింగపూర్‌ ప్రభుత్వం ఓ వినూత్న ప్రయత్నం చేసింది.

కరోనా పరీక్షల్లో ఆరోగ్య సిబ్బందిని పరిమితంగా వినియోగించడంతో పాటు ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కొరతను అధిగమించే లక్ష్యంతో ప్రత్యేక రోబోను అభివృద్ధి చేసింది. ఇకపై ‘స్వాబోట్‌’ తోనే స్వాబ్‌ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. నేషనల్‌ క్యాన్సర్‌ సెంటర్‌ సింగపూర్‌ (ఎన్‌సీసీఎస్‌), సింగపూర్‌ జనరల్‌ ఆస్పత్రి (ఎస్‌జీహెచ్‌) వైద్యులు మెడికల్‌ రొబొటిక్స్‌ టెక్నాలజీ కలిగిన బయోబోట్‌ సర్జికల్‌ సంస్థ భాగస్వామ్యంతో ‘స్వాబోట్‌’ను అభివృద్ధి చేసినట్టు న్యూస్‌ ఆసియా ఛానల్‌ వెల్లడించింది.

స్వీయ నియంత్రణ...

శిక్షణ కలిగిన తమ దేశ ఆరోగ్య సిబ్బందికి కొవిడ్‌ ముప్పు లేకుండా.. కరోనా టెస్టుల్లో వారి సేవల్ని పరిమితం చేసేలా ఈ రోబోలను అభివృద్ధి చేశారు. రోగుల ముక్కు నుంచి ఆటోమేటిక్‌గా ఈ రోబోలే స్వాబ్‌ తీస్తాయని ఆ సంస్థలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ స్వాబోట్‌ స్వీయ నిర్వహణ కలిగినదని, రోగులు దీన్ని తమ ఇష్టప్రకారం వినియోగించుకొనే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.

ఎలా పనిచేస్తుంది?

కరోనా పరీక్షలకు సిద్ధమైన వాళ్లు తమ గడ్డాన్ని రోబో దగ్గరకు తీసుకురాగానే అది యాక్టివేట్‌ అవుతుంది. అనంతరం స్వాబింగ్‌ ప్రక్రియ కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. నాసికా రంధ్రాల నుంచి దాదాపు 10.సెం.మీల మేర లోపలకు వెళ్లి నాసికా కుహరంలో స్వాబ్‌ను సేకరిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతో సున్నితమైన ఈ ప్రక్రియలో సర్జన్ల మాదిరిగానే ఇది చాలా సున్నితంగా.. కచ్చితత్వంతో స్వాబ్‌ తీస్తుందని ఎస్‌జీహెచ్‌ వైద్యులు డాక్టర్‌ లూకే టే చెప్పారు. ముక్కు నిర్మాణం, ఆకృతుల్లో తేడా ఉన్నప్పటికీ నమూనాల నాణ్యత మాత్రం స్థిరంగా ఉంటుందని వెల్లడించారు.

కొత్తగా 31 కేసులు..

సింగపూర్‌లో సోమవారం కొత్తగా మరో 31 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో తొమ్మిది మంది విదేశాల నుంచి వచ్చినవారే ఉన్నట్టు అక్కడి ప్రభుత్వం తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 57609 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 57181 మంది రికవరీ కాగా.. 27మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: మెదడుకు శిక్షణతో మోషన్‌ సిక్‌నెస్‌ దూరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.