ETV Bharat / international

కరోనా బీభత్సం- ఆ దేశాల్లో మళ్లీ లాక్​డౌన్​

ఏడాది కాలంగా యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి.. ఇటీవల మళ్లీ పంజా విసురుతోంది. కొన్ని దేశాల్లో వైరస్‌ విజృంభణ.. అక్కడ మరోసారి 'లాక్‌డౌన్‌'కు దారితీసింది. ఇప్పటికే ఫ్రాన్స్‌ సహా పలు దేశాలు లాక్‌డౌన్‌ విధించగా.. తాజాగా బంగ్లాదేశ్‌ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియాలోనూ వైరస్​ బారిన పడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అక్కడ వరుసగా నాలుగో రోజూ కేసుల సంఖ్య 500 దాటింది.

world corona cases and lockdown news
కరోనా బీభత్సం- ఆ దేశాల్లో మళ్లీ లౌక్​డౌన్​
author img

By

Published : Apr 3, 2021, 2:12 PM IST

Updated : Apr 3, 2021, 2:24 PM IST

దక్షిణ కొరియాలో రోజువారీ కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. వరుసగా నాలుగోరోజూ అక్కడ కొత్తగా వైరస్​బారిన పడినవారి సంఖ్య 500 దాటింది. మరోవైపు టీకా పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతున్నందున అక్కడి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణ కొరియాలో శనివారం కొత్తగా 543 మందికి వైరస్​ సోకిందని ఆ దేశ వ్యాధి నియంత్రణ కేంద్రం తెలిపింది. ఈ కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 1,04,736కు చేరిందని చెప్పింది. వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,740కు పెరిగినట్లు వెల్లడించింది.

కొత్తగా నమోదైన కేసుల్లో 320 కేసులు.. ఒక్క సియోల్​ నగరంలోనే వెలుగు చూశాయి. మహమ్మారి బారినపడే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. ఇంటివద్దే పరీక్షలు నిర్వహించుకునేందుకు వీలుగా ర్యాపిడ్​ టెస్టులను అనుమతించాలని అక్కడి వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది.

బంగ్లాదేశ్‌లో వారంపాటు..

బంగ్లాదేశ్​లో కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. శుక్రవారం అక్కడ 6,800పైగా మంది కొత్తగా వైరస్‌ బారినపడ్డారు. 50మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ విజృంభణ వల్ల ఇటీవల అక్కడి ప్రభుత్వం పలు దేశాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. తాజాగా వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించింది. ఏప్రిల్‌ 5వ తేదీ సోమవారం నుంచి ఏడు రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు బంగ్లా ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది.

ఫ్రాన్స్‌లో మూడోసారి..

కరోనా తీవ్రతకు ఐరోపా దేశం ఫ్రాన్స్‌ వణికిపోతోంది. ఇప్పటికే అక్కడ మూడో దశ కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి నెల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ఇటీవల వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో ఫ్రాన్స్‌ నాలుగో స్థానంలో ఉంది.

పోలాండ్‌ మూడు వారాలు..

పోలాండ్‌లో రోజువారీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతేడాది నవంబరు తర్వాత కేసులు భారీ స్థాయిలో ఉండటం మళ్లీ ఇప్పుడే. దీంతో ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. మూడు వారాల పాటు అత్యవసరం కాని దుకాణాలు, ఇతర కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మహమ్మారిపై నియంత్రణ కోల్పోతున్నందునే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని లాక్‌డౌన్‌ ప్రకటన సందర్భంగా అధ్యక్షుడు ఆండ్రెజ్‌ డుడా పార్లమెంట్‌లో అన్నారు.

బెల్జియంలో కఠినంగా..

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో బెల్జియం మరోసారి నాలుగు వారాల పాటు కఠిన లాక్‌డౌన్‌ విధించింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావదొద్దని హెచ్చరించింది. కొత్త నిబంధనల ప్రకారం.. అత్యవసరం కాని దుకాణాల్లోకి కస్టమర్లు అపాయింట్‌మెంట్‌ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. బ్యూటీపార్లర్లు, సెలూన్లను మూసివేసింది.

ఇదీ చూడండి:ఇంట్లోనే కరోనా టెస్టు- 20 నిమిషాల్లో ఫలితం!

Last Updated : Apr 3, 2021, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.