ETV Bharat / international

సింగపూర్​ ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం

సింగపూర్​ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని లీ షియాన్ లూంగ్ నేతృత్వంలోని పీపుల్స్ యాక్షన్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 93 నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 83 స్థానాల్లో పీఏపీ విజయదుందుభి మోగించింది. ఫలితంగా మరోసారి సింగపూర్​ ప్రధాని పదవిని షియాన్​ లూంగ్​ అధిష్ఠించనున్నారు.

SINGAPORE-POLL-RESULTS
లీ షియాన్ లూంగ్
author img

By

Published : Jul 11, 2020, 4:38 AM IST

సింగపూర్​ సార్వత్రిక ఎన్నికల్లో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) ఘన విజయం సాధించింది. దేశంలోని 93 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రధాని లీ షియాన్ లూంగ్ పార్టీ 83 సీట్లు గెలుచుకుంది. ప్రధాని లూంగ్ కూడా తన గ్రూప్ రిప్రెజెంటేషన్​ నియోజకవర్గం నుంచి మళ్లీ గెలుపొందారు.

భారత సంతతికి చెందిన ప్రీతమ్ సింగ్​ నేతృత్వంలోని వర్కర్స్ పార్టీ మిగిలిన పది స్థానాల్లో గెలుపొందింది. ఈ స్థానాల్లోనూ పీఏపీ గట్టి పోటీనిచ్చినా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది.

మాస్కులు, గ్లౌజులతో..

పటిష్ఠ భద్రత నడుమ శుక్రవారం సింగపూర్​ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. కరోనా సంక్షోభం మొదలైన తరువాత ఓ ఆగ్నేయాసియా దేశంలో జాతీయ ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. కరోనా నేపథ్యంలో ఓటర్లు మాస్కులు, చేతి తొడుగులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ... ఓటింగ్​లో పాల్గొన్నారు. కరోనా రోగులకు, క్వారంటైన్​లో ఉన్నవారికి మాత్రం ఓటింగ్​కు అనుమతించలేదు.

ఈసారీ.. 'లీ'దే అధికారం

2015లో పీఏపీ.. 63 శాతం ఓట్లను, 93 శాతం పార్లమెంటరీ సీట్లను కైవసం చేసుకుంది. దేశంలో కరోనా సంక్షోభం, ఆర్థిక మాంద్యం విలయతాండవం చేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్థిర ప్రభుత్వం అవసరం. ఇదే అధికార 'పీపుల్స్ యాక్షన్ పార్టీ'కి కలిసివచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

చిన్నపార్టీలు కూడా..

10 చిన్న విపక్ష పార్టీలు అధికార పీఏపీతో పోటీపడ్డాయి. ఇవి మొత్తం దాదాపు 93 స్థానాల్లో పోటీచేశాయి. ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీగా ఉంచేందుకుగాను తమకు మరిన్ని ఎక్కువ సీట్లు అందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశాయి.

ఘన వారసత్వం..

1959 నుంచి పీపుల్స్ యాక్షన్ పార్టీ సింగపూర్​ రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రస్తుత ప్రధాని లీ షియాన్ లూంగ్​ తండ్రి అయిన 'లీ కువాన్ యూ'... సింగపూర్​కు మొదటి ప్రధానమంత్రిగా సేవలందించారు. ఆయన తన 31 ఏళ్ల పాలనలో.. అత్యంత పేద దేశంగా ఉన్న సింగపూర్​ను ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా తీర్చిదిద్దారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.