డ్రగ్స్ అక్రమ రవాణా చేసేందుకు కుట్ర పన్నిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు మరణశిక్షను సింగపూర్ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. ఈ కేసులో యావజ్జీవ జైలు శిక్ష పడిన మరో వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు తొసిపుచ్చింది(singapore indian origin death penalty).
ఈ కేసు 2016 మార్చి 5 నాటిది. కమల్‌నాథన్, ప్రవినాష్ వుడ్‌ల్యాండ్స్ చెక్‌పాయింట్ ద్వారా సింగపూర్ వెళ్లారు. క్రాంజి ఎంఆర్టీ రైల్వే స్టేషన్ చేరినప్పుడు ప్రవినాష్ బ్యాగులో డ్రగ్స్ దాచారు. ఆ తర్వాత ఇద్దరు దగ్గర్లోని కాఫీ షాప్‌కు వెళ్లారు. అప్పుడు కమల్‌నాథ్ సురెన్ అనే వ్యక్తికి కాల్ చేశాడు. ఆ తర్వాత క్రాంజి రోడ్‌కు వెళ్లి చంద్రూ అనే వ్యక్తిని కలిశారు. అతను వీరికి డబ్బులతో పాటు ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలు ఇచ్చాడు. ఈ ముగ్గురిని నార్కొటిక్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ప్రవినాష్ బ్యాగులో 1.64 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు(singapore drugs case).
అయితే కమల్‌నాథ్ 48 డాలర్లు ఇచ్చి సింగపూర్ రమ్మనడం వల్లే ప్రవినాష్ వెళ్లినట్లు విచారణలో తేలింది(indian origin death penalty in singapore). చంద్రూ కూడా సరైన వివరణ ఇవ్వలేదు. కేసు విచారణలో ప్రవినాష్ పోలీసులకు సహకరించాడు. దీంతో కమల్‌నాథ్, చంద్రుకు మరణ శిక్ష విధించాలని కోర్టు ఆదేశించింది. ప్రవినాష్కు యావజ్జీవ జైలు శిక్షతో 15 లాఠీ దెబ్బలు కొట్టాలని తీర్పునిచ్చింది. దీన్ని వీళ్లు ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేసినా ఫలితం లేకపోయింది(singapore indian origin).
మరణ శిక్షను సవాల్ చేయక..
భారత సంతతికి చెందిన మరోవ్యక్తి పనీర్ సెల్వం ప్రాంథమన్కు 2017లో 51 కేజీల హెరాయిన్ దిగుమతి చేసినందుకు మరణశిక్ష విధించింది కోర్టు. అయితే కేసు విచారణపై తాను కోర్టులో అప్పీల్ చేస్తాననడం వల్ల శిక్ష అమలును రెండేళ్లు నిలిపివేసింది. కానీ అతను ఎలాంటి అప్పీల్ చేయలేదు. తమకు పిటిషన్ దాఖలు చేయమని చెప్పలేదని పనీర్ సెల్వం లాయర్లు కోర్టుకు తెలిపారు. దీంతో అతనికి మరణశిక్ష అమలుకానుంది(singapore indian origin news).
పోలీసులను దూషించి
పోలీసులను దూషించిన మరో కేసులో భారత సంతతికి చెందిన క్లారెన్స్ సెల్వరాజుకు 8నెలల 17వారాల జైలు శిక్ష విధించింది సింగపూర్ కోర్టు. 4వేల డాలర్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. నేర చరిత్ర ఉన్న ఇతడు వివిధ కేసుల్లో ఇప్పటికే 18 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు. కానీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. 'నేను బయటకు వచ్చాక మీ అంతు చూస్తా' అని పోలీసులను బెదిరించాడు. దీంతో మరికొద్ది నెలలు జైల్లోనే గడపనున్నాడు(singapore indian origin case).
ఇదీ చదవండి: 'మేము అధికారంలోకి వస్తే ఆ భూభాగాలను తీసుకుంటాం'