ETV Bharat / international

కరోనా నుంచి కోలుకున్నా.. మళ్లీ వస్తుంది జాగ్రత్త! - coronavirus second time

కరోనా నుంచి కోలుకున్న వారు రెండోసారి కూడా వైరస్ బారిన పడుతున్నారు. దేశీయంగా ఈ రకమైన తొలికేసును హాంకాంగ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మార్చిలో కరోనా సోకి కోలుకున్న ఓ వ్యక్తికి తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్​గా తేలినట్లు చెప్పారు. అయితే ఈసారి ఎలాంటి లక్షణాలు కన్పించలేదన్నారు.

Scientists say Hong Kong man got coronavirus a second time
కరోనా నుంచి కోలుకున్నా మళ్లీ వస్తుంది జాగ్రత!
author img

By

Published : Aug 25, 2020, 12:24 PM IST

కరోనా బారిన పడి కోలుకున్నా వారు రెండో సారి సైతం మహమ్మారి బారినపడే అవకాశాలున్నాయా? అంటే అవుననే సమాధానమిస్తున్నారు హాంకాంగ్​ శాస్త్రవేత్తలు. ఓ 33 ఏళ్ల వ్యక్తి రెండోసారి కరోనా బారిన పడినట్లు స్పష్టం చేశారు. ఈ వ్యక్తికి మార్చిలోనే కరోనా సోకింది. వ్యాధి నుంచి కోలుకున్నాక స్పెయిన్​ పర్యటనకు వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించగా..పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. హాంకాంగ్​లో ఈ తరహా కేసు నమోదు కావడం ఇదే తొలిసారి.

అయితే రెండోసారి కరోనా వచ్చిన వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు లేవని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను 'క్లినికల్​ ఇన్​ఫెక్టియస్​ డిసీస్'​ జర్నల్​ అంగీకరించినప్పటికీ ఇంకా ప్రచురించాల్సి ఉంది.

కరోనా సోకిన వారిలో దీర్ఘకాల రోగ నిరోధక శక్తి లేకపోతే మళ్లీ వ్యాధి సోకే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే తీవ్ర అనారోగ్యానికి గురికాకుండా తట్టుకునే సామర్థ్యం ఉంటుందన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధికి ఈ విషయాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

మే నెలలో 4,173 మంది వైద్యుల ద్వారా చేసిన ఓ సర్వేలోనూ ఈ తరహా కేసులు నమోదైనట్లు తేలింది. సర్వేలో పాల్గొన్న 13 శాతం మంది వైద్యులు.. తమ దగ్గరకు వచ్చిన కొంత మంది రోగులు రెండోసారి వైరస్ బారినపడినట్లు ధ్రువీకరించారు. అమెరికా, ఇతర దేశాలకు చెందిన వైద్యులు ఇందులో ఉన్నారు.

ఇదీ చూడండి: ప్లాస్మా చికిత్సకు అమెరికా అత్యవసర అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.