ETV Bharat / international

రష్యాలో ఆగని కరోనా మృత్యువిలయం - వియత్నాంలో కరోనా మరణాలు

యూరప్​ను మళ్లీ కలవరపెడుతున్న కరోనా.. రష్యాను కూడా తీవ్ర (corona cases in russia) ఇబ్బందులకు గురిచేస్తోంది. వైరస్​ మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మరోవైపు బంగ్లాదేశ్​లో మాత్రం కొవిడ్ మరణాలు జీరోకు చేరుకున్నాయి. కేసుల తగ్గుదలతో వియత్నాం కూడా తొలిసారి పర్యటకులకు అనుమతినిచ్చింది.

corona cases in russia
బంగ్లాదేశ్​లో కరోనా మరణాలు
author img

By

Published : Nov 20, 2021, 10:18 PM IST

రష్యాను కరోనా మహమ్మారి (corona cases in russia) గజగజ వణికిస్తోంది. గత కొన్ని వారాలుగా తగ్గినట్టే తగ్గి మళ్లీ ముసురుకుంటోంది. కొత్త కేసులు, మరణాలు రోజురోజుకీ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వరుసగా నాలుగో రోజూ కొవిడ్‌ మృతుల సంఖ్య 1200లకు పైగా నమోదైంది. దేశంలో బుధవారం 1247 మంది కొవిడ్‌తో మృత్యువాత పడగా.. గురువారం 1251, శుక్రవారం 1254 మంది చొప్పున మరణించారు. అలాగే, శనివారం కూడా 1254మంది కరోనా కాటుకు బలికాగా.. 37,120మందికి ఈ మహమ్మారి సోకినట్టు రష్యా కరోనా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వెల్లడించారు. గత కొన్ని వారాలుగా కొవిడ్‌ ఉద్ధృతి తగ్గినట్టు కనబడినప్పటికీ.. గతంలో కన్నా అధికంగా కేసులు, మరణాలు నమోదుకావడం గమనార్హం.

వ్యాక్సినేషన్‌ రేటు మందగించడం, కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో ప్రజలు అలసత్వ ధోరణిని ప్రదర్శించడమే తాజాగా ఈ మహమ్మారి పెరుగుదలకు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచంలో తొలిసారి రష్యాలోనే కరోనా టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఇప్పటిదాకా కేవలం 40శాతం మందికి మాత్రమే పూర్తిస్థాయిలో టీకా మోతాదులు అందాయి. రష్యాలో ఇప్పటివరకు 9.3మిలియన్లకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. 2,62,843మంది ప్రాణాలు కోల్పోయినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. వాస్తవంగా ఈ సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంటుందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. యూరప్‌ దేశాలతో పోలిస్తే రష్యాలోనే కరోనా ఉద్ధృతి అధికం.

బంగ్లాలో జీరో మరణాలు..

కరోనా మరణాలను కట్టడి చేయడంలో (bangladesh corona updates) బంగ్లాదేశ్ విజయం సాధించింది. వైరస్​పై పోరాటంలో.. గత ఏడాదిగా తొలిసారి జీరో మరణాలు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా మరణాలను 27,946కు పరిమితం చేయగలిగామని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆ దేశంలో 15 లక్షల కరోనా మరణాలు నమోదయ్యాయి.

వియత్నాంలో పర్యాటకం షురూ..

వియత్నాంలో కరోనా నిబంధనలను(Vietnam corona cases) సడలించింది ప్రభుత్వం. రెండేళ్లుగా మూసివేసిన పర్యాటకానికి తలుపులు తెరిచింది. మొదటిసారి 200 మంది పర్యటకులు తాజాగా ఆ దేశంలోని ఫు క్వాక్ దీవికి వెళ్లారు. విదేశీయులకు క్వారంటైన్ వంటి నిబంధనలను రద్దు చేశారు. టెస్టులు నిర్వహించి, నెగెటివ్​గా తేలినవారిని తమ దేశంలోకి ఆహ్వానిస్తున్నారు.

ఇదీ చదవండి: కొవిడ్ నిబంధనలు మాకొద్దని రోడ్డెక్కిన వేలమంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.