ETV Bharat / international

పడకలు దొరక్క కరోనా బాధితుల ఇక్కట్లు - భారతదేశంలో కరోనా

ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతూనే ఉంది. ఐరోపా, ఆసియా దేశాల్లో వైరస్​ తీవ్రంగా విజృంభిస్తోంది. రష్యాలో.. ఆస్పత్రులు కొవిడ్​ బాధితులతో నిండిపోయాయి. చైనాలో దేశీయంగా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. సామూహిక పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

Russia's health system under strain as the virus surges back
పడకలు దొరక్క కరోనా బాధితుల ఇక్కట్లు!
author img

By

Published : Nov 22, 2020, 3:28 PM IST

రష్యాలో కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. మరణాలూ అదే రీతిలో నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యా రోజురోజుకూ అధికమవుతోంది. ఫలితంగా.. పడకలు దొరక్క బాధితులు ఇక్కట్లు పడుతున్నారు. వైరస్​ సోకి రోజులు గడుస్తున్నా ఆస్పత్రుల్లో చేరలేకపోతున్నారు. బుధవారం నాటికి దేశవ్యాప్తంగా 81 శాతం ఆస్పత్రుల బెడ్లు నిండిపోయాయి.

ఆస్పత్రుల కారిడార్లలోనే వందలాది రోగులు ఎదురుచూడాల్సి వస్తోంది. మృతదేహాలను నలుపు రంగు ప్లాస్టిక్​ బ్యాగుల్లో బయట పోగుచేస్తున్నారు. బయట అంబులెన్సులు క్యూ కడుతున్నాయి. ఇలాంటి భయానక చిత్రాలు.. బాధితులను కలవరపెడుతున్నాయి.

అక్టోబర్​ 1 నుంచి ప్రతి లక్ష మందిలో వెలుగుచూస్తున్న కొత్త కేసుల సంఖ్య రెట్టింపైనట్లు ప్రభుత్వం తెలిపింది. రష్యాలో మొత్తం కేసులు 20 లక్షలు దాటిపోయాయి. మరణాల సంఖ్య 35 వేలను అధిగమించింది.

సామూహిక టెస్టులు..

చైనాలో చాలా రోజుల తర్వాత.. దేశీయంగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. చైనాలోని మంగోలియాలో ఆదివారం రెండు.. షాంఘైలో ఒక కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో.. ఆయా ప్రాంతాల్లో సామూహికంగా పరీక్షలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.

మాంజూలీ ప్రాంతంలో పాఠశాలలను మూసివేశారు. ప్రజలు బయట తిరగటంపై ఆంక్షలు విధించారు. చైనాలో మొత్తం 86 వేల 431 కరోనా కేసులున్నాయి.

పాక్​లో మరో 59 మంది మృతి..

పాకిస్థాన్​లో కరోనా మరణాల సంఖ్య 7,662కు చేరింది. శనివారం 2,600 కొత్త కేసులు.. 59 మరణాలు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 3 లక్షల 74 వేలమందికిపైగా వైరస్​ సోకింది.

ఇదీ చూడండి: పండుగ వేళ జపాన్​లో కరోనా విజృంభణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.