ETV Bharat / international

పాఠశాలలో కాల్పులు- 8 మంది మృతి - russia seven killed in shooting

russian-state-media-reports-that-8-students-and-one-teacher-have-been-killed-in-a-school-shooting-in-kazan-ap
పాఠశాలలో కాల్పుల మోత- 9మంది మృతి
author img

By

Published : May 11, 2021, 1:43 PM IST

Updated : May 11, 2021, 4:17 PM IST

13:40 May 11

పాఠశాలలో కాల్పులు- 8 మంది మృతి

రష్యాలోని కజన్​ ప్రాంతంలో ఓ పాఠశాలలో మంగళవారం జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కాల్పుల్లో మొత్తం 8 మంది చనిపోయారు. 18 మంది విద్యార్థులు సహా 21 మంది గాయపడ్డారు. 

మృతి చెందినవారంతా ఎనిమిదో తరగతి విద్యార్థులేనని టాటర్​స్థాన్ రిపబ్లిక్ గవర్నర్ రుస్తమ్ మిన్నికనోవ్ తెలిపారు. వీరిలో నలుగురు బాలురు, ముగ్గురు బాలికలు కాగా ఒకరు అధ్యాపకులు. 19 ఏళ్ల ఓ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతడి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

పాఠశాల నుంచి అనేక మంది విద్యార్థులను తరలించామని.. ఇంకా కొంతమంది భవనంలోనే ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఘటన నేపథ్యంలో కజన్​ ప్రాంతంలోని అన్ని పాఠశాలల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని స్పష్టం చేశారు.

ఈ ఘటనలో 11 మంది మరణించినట్లు తొలుత స్థానిక మీడియా వార్తలు వెలువరించింది. అయితే ప్రభుత్వం మాత్రం 8 మంది చనిపోయినట్లు ప్రకటించింది. 

ఇదీ చదవండి: కరోనా లెక్కలపై సౌమ్య స్వామినాథన్​ ఆందోళన

Last Updated : May 11, 2021, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.