ETV Bharat / international

ఈ ద్రాక్ష చాలా ఖరీదు- గుత్తి రూ.35 వేలు! - ప్రపంచంలోనే ఖరీదైన ద్రాక్ష పండ్లు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్ష గురించి ఎప్పుడైనా విన్నారా? జపాన్​లో మాత్రమే పండే రుబీ రోమన్​ రకం ద్రాక్ష ఒక్కో గుత్తికి వేల రూపాయలు ధర(Ruby roman grapes price) పలుకుతోంది.

Ruby Roman
రుబీ రోమన్​ రకం ద్రాక్ష
author img

By

Published : Sep 23, 2021, 8:45 AM IST

కిలో ద్రాక్ష పండ్లు ఖరీదు ఎంత ఉంటుంది? సాధారణంగా రూ.100 లేదా రూ.200 వరకూ ఉండొచ్చు. కానీ ఒక్కో గుత్తి రూ.35 వేలు (450 డాలర్లు)కు(Ruby roman grapes price) అమ్ముతున్నారని తెలిస్తే కళ్లు బైర్లుకమ్మడం ఖాయం.

జపాన్‌లో మాత్రమే పండే 'రూబీ రోమన్‌' రకం(Ruby Roman grapes in Japan ) ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా ప్రత్యేకత చాటుకుంటోంది. దీని రంగు, రుచి, పరిమాణాల్లో ఉన్న అరుదైన లక్షణాల కారణంగానే దీనికి ఇంత డిమాండ్‌ ఏర్పడింది. ద్రాక్షగుత్తిలో ఒక్కో పండు కనీసం 20 గ్రాముల బరువు, 30 మి.మీ. పరిమాణం ఉండడంతో పాటు నిర్దేశిత స్థాయిలో రంగు, చక్కెర శాతం ఉన్నవాటిని ప్రత్యేకంగా ఎంపిక చేసి అమ్మకానికి ఉంచుతారు.

Ruby Roman
రుబీ రోమన్​ రకం ద్రాక్ష

ఈ పండు ప్రత్యేకతలు..

  • ఒకే రంగు, ఒకే సైజ్‌లో ఈ పండ్లు ఉంటాయి.
  • ఒక్కో పండు కనీసం 20 గ్రాముల బరువు, 30 మి.మీ. పరిమాణం ఉంటుంది.
  • నిర్దేశిత స్థాయిలో రంగు, చక్కెర శాతం ఉన్నవాటిని ప్రత్యేకంగా ఎంపిక చేసి అమ్మకానికి ఉంచుతారు.
  • సాధారణ ద్రాక్ష కంటే 18 శాతం అధికంగా తీపి కలిగి ఉంటుంది.
  • ఇషికావా అధికారులు నిబంధనలకు అనుగుణంగా రూబీ రోమన్‌ ద్రాక్షపండ్లు విక్రయించాలి.
  • ఏడాదిలో ఒకసారి మాత్రమే పండుతుంది.

ఇదీ చూడండి: వామ్మో​.. ఈ చికెన్​ ఎగ్​ రోల్​ ఎంత పెద్దదో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.