ETV Bharat / international

తాలిబన్ల రాజ్యంతో భారత్​కు ముప్పు తప్పదా..? - అఫ్గానిస్థాన్ తాలిబన్లు

ఎట్టకేలకు అఫ్గానిస్థాన్​ తాలిబన్ల వశం అయింది. అయితే తాలిబన్ల రాజ్యంతో భారత్​కు ముప్పు పొంచి ఉందా..? జమ్ముకశ్మీర్​లో అలజడులు సృష్టించే అవకాశం ఉందా..? తదితర అంశాలపై విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏఆర్‌కే రెడ్డి ఏమన్నారంటే..?

talibans
తాలిబన్ల రాజ్యం
author img

By

Published : Aug 16, 2021, 11:54 AM IST

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యంతో భారత్‌కు ముప్పు పొంచి ఉందని విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏఆర్‌కే రెడ్డి తెలిపారు. తాలిబన్‌ గ్రూపులను పాకిస్థాన్‌ వాడుకుంటూ భారత్‌లో అంతర్గత తీవ్రవాదాన్ని పెంచి, జమ్ముకశ్మీర్‌లో అస్థిరతను సృష్టించే ప్రమాదముందని చెప్పారు. తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ సాంస్కృతిక వైభవాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని, భవిష్యత్తులో మరిన్ని సమస్యలు సృష్టిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.

చైనా మద్దతుతో..

విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏఆర్‌కే రెడ్డి

అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నందున చైనా వారికి మద్దతిస్తోందని తెలిపారు. తాలిబన్లతో అమెరికా, ఐరోపా యూనియన్‌ దేశాలకు మరోసారి తీవ్రవాద ముప్పు పొంచి ఉందన్నారు. అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల వశమైన నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న ఏఆర్‌కే రెడ్డి 'ఈనాడు-ఈటీవీ'తో మాట్లాడారు.

'20 ఏళ్ల కిందట తాలిబన్ల పరిపాలనలో అఫ్గానిస్థాన్‌ పూర్తిగా ధ్వంసమైంది. గతంలో కశ్మీర్‌లో పట్టుబడిన తీవ్రవాద ముఠాల్లో తాలిబన్లు కూడా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తాలిబన్లను వాడుకుంటూ బలూచిస్థాన్‌లో ఉద్యమాన్ని పాకిస్థాన్‌ కొంతకాలం అణచివేస్తుంది. తద్వారా అక్కడి సైన్యాన్ని భారత సరిహద్దులో మోహరించే అవకాశముంది. ఈ పరిస్థితి మనకు ఇబ్బందికరమే. అఫ్గానిస్థాన్‌లో 40 ఏళ్ల క్రితం మగపిల్లవాడికి పదహారేళ్లు నిండితే గుర్రం, తుపాకీ ఇచ్చి బతకమని బయటకు పంపించేవారు. రష్యా, అమెరికా, ఐరోపాల ప్రభావంతో అక్కడ స్వేచ్ఛగా, మానవహక్కులతో సంతోషంగా బతకాలన్న ఆలోచన పెరిగి సాంస్కృతిక మార్పు వచ్చింది. భారత్‌ చేసిన అభివృద్ధితో అక్కడి ప్రజల్లో మన దేశంపై సానుకూల వైఖరి ఉంది. ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పరిస్థితి మారుతుంది'

-- ఏఆర్‌కే రెడ్డి, విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌

సైన్యంలో సానుభూతిపరులు..

అఫ్గాన్‌ సైన్యం ప్రతిఘటన లేకుండా లొంగిపోవడంపై మాట్లాడుతూ.. 'తాలిబన్లది క్రమపద్ధతి లేని యుద్ధరీతి. అఫ్గాన్‌ సైన్యానికి ఆయుధాలు, టెక్నాలజీ వాడటంలో అమెరికా 20 ఏళ్లుగా శిక్షణ ఇచ్చింది. సైన్యంలో చాలామంది తాలిబన్‌ సానుభూతిపరులు ఉన్నారు. వీరి సహకారంతోనే తాలిబన్లు వేగంగా దేశాన్ని, పరిపాలనను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నారు' అని వివరించారు.

విఘాతం తప్పదేమో: కాళిదాస్​

అఫ్గానిస్థాన్‌లోని ప్రస్తుత పరిణామాలు ప్రపంచశాంతికి విఘాతం కలిగించే అవకాశం ఉందని భారత వైమానికదళంలో ఉన్నతాధికారిగా పనిచేసిన స్క్వాడ్రన్‌ లీడర్‌ కాళిదాస్‌ అభిప్రాయపడ్డారు. తాలిబన్ల తిరుగుబాటు, తదనంతర పరిస్థితులపై 'ఈనాడు, ఈటీవీ'తో మాట్లాడిన ఆయన భారత్‌తోపాటు ప్రజాస్వామ్య దేశాలైన ఇజ్రాయెల్‌, అమెరికాలే వారికి ప్రధాన లక్ష్యమని తెలిపారు.

"తాలిబన్లను కొన్ని దేశాలు పెంచి పోషించాయి. భౌగోళికంగా పక్కనే ఉన్న భారత్‌పై శత్రు దేశాలతో కలిసి దాడికి యత్నించే అవకాశం ఉంది. ఇప్పటికే సుమారు పదికిపైగా తీవ్రవాద సంస్థలను పోషిస్తున్న పాకిస్థాన్‌తో ఒకవైపు ఇబ్బంది అయితే.. ప్రస్తుతం తాలిబన్‌ ఆక్రమిత అఫ్గానిస్థాన్‌ మరో సమస్యగా మారే అవకాశం ఉంది. తాలిబన్లు ఇదేవిధంగా చెలరేగితే మూడో ప్రపంచయుద్ధ పరిస్థితులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అఫ్గానిస్థాన్‌కు చైనాతోపాటు పాకిస్థాన్‌ సహాయం చేసి భారత్‌ను అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతాయి. అఫ్గాన్‌కు మరోపక్క ఉన్న పాకిస్థాన్‌, అక్కడున్న ఉగ్రవాద సంస్థలపై తాలిబన్లు ఆధిపత్యం చెలాయిస్తే భారత్‌కు తీవ్రనష్టం వాటిల్లే అవకాశం ఉంది."

-- కాళిదాస్‌, స్క్వాడ్రన్‌ లీడర్‌

తాలిబన్లు బాలిస్టిక్‌ క్షిపణులు ప్రయోగించారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు తీవ్ర కలవరపెడుతున్నాయని కాళిదాస్​ చెప్పారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భారత్‌ మిత్రదేశాలతో కలిసి కార్యాచరణపై కసరత్తు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి:

Afghanistan News: 'రక్తపాతం వద్దనే దేశం వదిలి వెళ్లా..'

అఫ్గాన్‌లో తాలిబన్ల రాజ్యం- భయపడుతున్న జనం

Taliban News: క్రూరత్వానికిి మారుపేరు.. ఎవరీ తాలిబన్లు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.