పాకిస్థాన్‌లోని ఇమ్రాన్‌ఖాన్ నాయకత్వంలో మత స్వేచ్ఛ క్షీణిస్తోందని యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ది స్టేటస్ ఆఫ్ ఉమన్ (సీఎస్‌డబ్ల్యూ) 47 పేజీల నివేదికలో పేర్కొంది. మైనార్టీలపై దాడులు చేసేందుకు.. ఉగ్రవాద మనస్తత్వం ఉన్నవారిని తెహ్రీక్- ఇ-ఇన్సాఫ్ ప్రభుత్వం పెంచి పోషిస్తోందని సీఎస్‌డబ్ల్యూ వివరించింది.
దేశంలోని క్రైస్తవ, హిందూ మతాలకు చెందిన ప్రజలపై దాడులు చేస్తున్నారని, ముఖ్యంగా మహిళలు, బాలికలపైనా ఈ హింస ఎక్కువగా ఉందని పేర్కొంది.
"ఏటా వందలాది మంది అమ్మాయిలను అపహరించి బలవంతంగా మతం మార్పిడి చేయిస్తున్నారు. ముస్లిం పురుషులతో వివాహం చేయిస్తున్నారు. అపహరణకు గురైన వారి కుటుంబాలకు బెదిరింపులు వస్తున్న కారణంగా మళ్లీ తిరిగి వారి కుటుంబాలకు చేరుకోవాలంటే బాధితులు భయపడుతున్నారు. మైనారిటీ బాధితుల పట్ల పోలీసులు, న్యాయ వ్యవస్థ వివక్ష చూపించడం వల్ల ఈ ఘటనలు మరింత పెరుగుతున్నాయి."
- సీఎస్‌డబ్ల్యూ నివేదిక
పేదలు, నిరక్ష్యరాస్యులే లక్ష్యంగా...
క్రైస్తవ, హిందూ మతాలకు చెందిన బాలికలు, మహిళల్లో ఎక్కువగా పంజాబ్, సింధ్ ప్రావిన్స్‌లలో బలవంతపు వివాహాలు, మతమార్పిడి కేసులు ఉన్నాయని సీఎస్డబ్య్లూ వివరించింది. వీరిలో ఎక్కువశాతం 18 ఏళ్లలోపు బాలికలు ఉన్నారని తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనకబడినవారు, నిరక్ష్యరాస్యులను లక్ష్యంగా చేసుకుని ఈ కార్యకలాపాలు సాగుతున్నట్లు వివరించింది. ఈ విధమైన హింస, మతపరమైన దాడులకు పాల్పడేవారిపై సత్వర చర్యలు తీసుకోవాలని సీఎస్‌డబ్ల్యూ... పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరింది.