సిరియా ఇద్లిబ్ ప్రాంతం బాంబు దాడులతో దద్దరిల్లుతోంది. ఇటీవల పలు గ్రామాలపై జరిగిన వైమానిక, ఫిరంగి దాడుల్లో 23 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, మహిళలు ఉన్నారు. మరో 30 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.
తల్మనాస్, బడామా, మాసరన్తోపాటు పలు గ్రామాల్లో జరిగిన దాడులు కారణంగా కుటుంబాలు చిన్నాభిన్నామయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు.
దాడుల గురించే తెలిసిన తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు వైట్ హెల్మెట్స్ సంస్థ వలంటీర్లు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.
ఏప్రిల్ నుంచి వెయ్యి మంది మృతి
సిరియాలో ఏప్రిల్ నుంచి జరిగిన దాడుల్లో 1,000 మంది మరణించగా, 4 లక్షల మంది వలసవెళ్లారు. ఆగస్టులో మాస్కో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించినప్పటికీ 250 మంది మరణించినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి :vమెక్సికోలో కాల్పులు... ఏడుగురు ముష్కరులు హతం