రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. పుతిన్ దగ్గరి వ్యక్తుల్లో ఒకరికి కొవిడ్ నిర్ధరణ కాగా.. ఆయన ఐసోలేషన్లోకి వెళ్లినట్లు రష్యా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
" రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. పుతిన్ దగ్గరి వ్యక్తుల్లో ఒకరికి కరోనా నిర్ధరణ అయింది. దీంతో ఆయన ఐసోలేషన్లోకి వెళ్లనున్నారు. కొవిడ్ పరీక్షలో పుతిన్‌కు నెగెటివ్ వచ్చింది."
-- దిమిత్రి పెస్కోవ్, క్రెమ్లిన్ అధికారిక ప్రతినిధి
అయితే.. పుతిన్ ఎన్నిరోజులు ఐసోలేషన్‌లో ఉంటారన్న విషయంపై మాత్రం పెస్కోవ్ స్పష్టతనివ్వలేదు. పుతిన్ ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ రెండు డోసులు తీసుకున్నారు.
రష్యాలో రోజువారీ కొవిడ్ కేసులు 17-18వేల వరకు నమోదవుతున్నాయి. రోజువారీ మరణాల సంఖ్య 800గా ఉంది. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 71 లక్షలు దాటింది. మొత్తం మరణాల సంఖ్య 194,249 కు చేరింది.
ఇదీ చదవండి: చైనాలో మళ్లీ కరోనా కలకలం- అక్కడ లాక్డౌన్