ETV Bharat / international

హాంకాంగ్: చైనా వార్తా ఏజెన్సీపై నిరసనకారుల దాడి

డ్రాగన్​ దేశం ఆజ్ఞల్లో ఉంటూ వస్తోన్న హాంకాంగ్​ వాసుల్లో నేరస్తుల అప్పగింత బిల్లు తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ప్రతిపాదిత బిల్లును చైనా వెనక్కి తీసుకున్నప్పటికీ తాజాగా  ఎన్నికలు సహా వివిధ సౌకర్యాలు కల్పించాలని ఉద్యమాన్ని మరో దిశగా నడిపిస్తున్నారు ఆందోళనకారులు. తాజాగా చైనా అధికారిక న్యూస్​ ఏజెన్సీ కార్యాలయంపై దాడి చేశారు.

హాంకాంగ్: చైనా వార్తా ఏజెన్సీపై నిరసనకారులపై దాడి!
author img

By

Published : Nov 3, 2019, 7:46 AM IST

హాంకాంగ్​లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ జినుహా కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేశారు. భద్రతా సిబ్బంది లక్ష్యంగా గ్యాసోలీన్ బాంబులు విసిరారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.

వాన్​ చాయ్​ ప్రాంతం పక్కనే ఉన్న జినుహా వార్తా కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేశారు. తలుపులను, కిటికీలను ధ్వంసం చేశారు. ఎరుపు, నలుపు పెయింట్​ను జల్లారు. గ్రాఫిటీ పెయింట్లు వేశారు. ఆఫీసు వరండాలో మంట పెట్టారు.

1997 సంవత్సరంలో హాంకాంగ్​ను బ్రిటన్.. చైనాకు వెనక్కి ఇచ్చిన సమయంలో.. హామి మేరకు ప్రవర్తించకుండా.. తమకు స్వేచ్ఛను ఇవ్వకుండా డ్రాగన్ దేశం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపిస్తున్నారు ఈ ద్వీప వాసులు. చైనా బ్యాంకులు, వ్యాపారాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు.

నేరస్తుల అప్పగింత బిల్లును వెనక్కి తీసుకోవాలని ప్రారంభమైన నిరసన.. ఆ నిర్ణయాన్ని డ్రాగన్ వెనక్కి తీసుకున్నప్పటికీ కొనసాగుతూనే ఉంది. హాంకాంగ్​లో ప్రత్యక్ష ఎన్నికలు సహా వివిధ సౌకర్యాలను కల్పించాలంటూ నిరసనకారులు తమ గళాలను నూతన దిశగా నడిపిస్తున్నారు.

ఇప్పటివరకు 3వేలమంది సాధారణ ప్రజలు అరెస్టయ్యారు. నిరసనకారులు నిబంధనలు ఉల్లంఘించడం అధికారులకు అతిపెద్ద సమస్యగా మారింది. వేర్పాటువాదం, కూలదోయడం, చొరబాటుకు యత్నించడం, విద్రోహమనే పేరుతో విదేశీ శక్తులు తమ భూభాగంలోకి వస్తే ఊరుకోబోమని స్థానికులు శుక్రవారం ప్రతిజ్ఞ చేశారు.

చైనా వార్తా ఏజెన్సీపై నిరసనకారుల దాడి

ఇదీ చూడండి: కాలుష్య నియంత్రణపై ఉమ్మడి ప్రణాళికకు సీఎంల వినతి

Bangkok (Thailand), Nov 02 (ANI): Prime Minister Narendra Modi welcomed at Marriott Marquis Hotel by members of Indian community in Bangkok on November 02. He is on 3-day visit to Thailand. He will interact with the Indian diaspora during 'Sawasdee PM Modi' programme today. PM Modi will also participate in the Association of Southeast Asian Nations (ASEAN), East Asia, and Regional Comprehensive Economic Partnership (RCEP) summits during the visit.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.