ETV Bharat / international

కోవింద్​తో బంగ్లా ప్రధాని భేటీ- ద్వైపాక్షిక అంశాలపై చర్చ

President Kovind Bangladesh visit: భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో భేటీ అయ్యారు బంగ్లాదేశ్​ ప్రధానమంత్రి షేక్​ హసీనా. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై చర్చించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.

Bangladesh PM calls on President Kovind
రాష్ట్రపతి కోవింద్​ బంగ్లా ప్రధాని భేటీ
author img

By

Published : Dec 15, 2021, 6:52 PM IST

President Kovind Bangladesh visit: మూడు రోజుల పర్యటన కోసం బంగ్లాదేశ్​ రాజధాని ఢాకా వెళ్లిన భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో.. ఆ దేశ ప్రధానమంత్రి షేక్​ హసీనా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బహుముఖ, సమగ్రమైన ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ఇరుపక్షాలు సమీక్షించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

" రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో పీఎం షేక్​ హసీనా భేటీ అయ్యారు. ఇరుపక్షాలు బహుముఖ, సమగ్ర ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. 1971 నాటి విముక్తి పోరాటం స్ఫూర్తిని ఇద్దరు నేతలు గుర్తు చేసుకున్నారు. మైత్రి దివస్​ను సంయుక్తంగా నిర్వహించటంపై సంతృప్తి వ్యక్తం చేశారు."

- ఆరిందమ్​ బాగ్చి, విదేశాంగ శాఖ ప్రతినిధి.

అంతకు ముందు రాష్ట్రపతి కోవింద్​తో బంగ్లాదేశ్​ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్​ మోమెన్​ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయాలని పునరుద్ఘాటించినట్లు ట్వీట్​ చేసింది ఆ దేశ విదేశాంగ శాఖ.

మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం బంగ్లాదేశ్​కు చేరుకున్నారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ఆయనకు ఢాకా విమానాశ్రయంలో బంగ్లాదేశ్​ అధ్యక్షుడు అబ్దుల్​ హమీద్​, ప్రథమ మహిళ రషిదా హమీద్​ స్వాగతం పలికారు. డిసెంబర్​ 17 వరకు ఆ దేశంలో పర్యటించనున్నారు కోవింద్​. బంగ్లాదేశ్​ 50వ విజయ్​ దివాస్​లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

ఇదీ చూడండి: విజయానికి 50 వసంతాలు- నేడు బంగ్లాదేశ్​కు రాష్ట్రపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.