ETV Bharat / international

ఎన్​సీపీ ఛైర్మన్​ పదవి నుంచి ఓలి తొలగింపు - నేపాల్​ రాజకీయాలు

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలిని.. నేపాల్​ కమ్యూనిస్టు​ పార్టీ(ఎన్​సీపీ) ఛైర్మన్​ పదవి నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ పార్టీ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ పుష్ప కమల్​ దహల్​ ప్రచండ. 1,199 మంది నూతన సభ్యులతో జరిగిన స్టాండింగ్​ కమిటీ సమావేశం అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓలి స్థానంలో పార్టీ సీనియర్ నాయకులు మాధవ్​ కుమార్ నేపాల్​ను నియమించారు.

Prachanda-led CPN removes PM Oli from party's chairman post
ఓలిను సీపీఎన్​ ఛైర్మన్​ పదవిని నుంచి తొలగింపు
author img

By

Published : Dec 23, 2020, 5:00 AM IST

Updated : Dec 23, 2020, 5:15 AM IST

నేపాల్​ కమ్యూనిస్ట్​ పార్టీ(ఎన్​సీపీ) ఛైర్మన్​ పదవి నుంచి.. ప్రధాని కేపీ శర్మ ఓలిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు పార్టీ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ పుష్ప కమల్​ దహల్​ ప్రచండ. నూతన సభ్యులతో జరిగిన స్టాండింగ్​ కమిటీ సమావేశం అనంతరం.. ఆయన ఈ విషయం వెల్లడించారు. ఓలిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు త్వరలో సమావేశం కానున్నట్లు స్పష్టం చేశారు.

ఓలి స్థానంలో ఛైర్మన్​గా.. సీనియర్​ నేత మాధవ్​ కుమార్​ నేపాల్​ను పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

అదే కారణం..

ఓలి.. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందున తొలగించాల్సి వచ్చిందని ఎన్​సీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు రేఖా శర్మ తెలిపారు. ఇప్పటినుంచి జరగబోయే సమావేశాలు ప్రచండ, మాధవ్​​ అధ్యక్షతన జరుగుతాయన్నారు.

కేంద్ర కమిటీ సభ్యుల్లో.. మూడింట రెండొంతుల మంది సమావేశానికి హాజరయ్యారు. ప్రచండను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా బుధవారం ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది.

చీలిక దిశగా నేపాల్​ అధికార పార్టీ..

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో నేపాల్​ కమ్యూనిస్టు పార్టీ(ఎన్​సీపీ) చీలిక దిశగా పయనిస్తోంది. 3 రోజుల క్రితం ఏకపక్షంగా పార్లమెంటును రద్దుచేసి పార్టీలో అసమ్మతి వర్గానికి షాక్​ ఇచ్చిన ఓలి.. అదే దూకుడు కొనసాగిస్తున్నారు. పార్టీలో మెజారిటీ మద్దతు లేనప్పటికీ తన పట్టు నిలుపుకునేందుకు అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. మంగళవారం తన సన్నిహితులైన కొద్దిమంది పార్టీ కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఎన్​సీపీ సాధారణ సమావేశాల నిర్వహణకు 1199 సభ్యులతో కొత్త కమిటీని ప్రకటించారు. వారితో ప్రధాని అధికారిక నివాసంలో ప్రమాణస్వీకారం చేయించారు.

ఇదీ చదవండి : నేపాల్ పార్లమెంటు రద్దు- వేసవిలో ఎన్నికలు

ఇదీ చదవండి : నేపాల్​ దారెటు? భారత్​పై ప్రభావమెంత?

Last Updated : Dec 23, 2020, 5:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.