గంటల వ్యవధిలో వెంట వెంటనే సంభవించిన రెండు భారీ భూకంపాలతో న్యూజిలాండ్ వణికిపోయింది. పసిఫిక్ మహా సముద్రంలో 8.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకు ముందు 7.3 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
ఈ భూకంపాల నేపథ్యంలో న్యూజిలాండ్, అమెరికాలో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. అనంతరం అమెరికాలో ఆ దేశ పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం వాటిని ఉపసంహరించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూకంప భయంతో ప్రజలు రాతంత్రా ఇళ్ల బయటే గడిపారు. మొదటి భూకంపం న్యూజిలాండ్‌లోని కెర్‌మాడిక్ దీవుల వద్ద సముద్రంలో 21 కిలోమీటర్ల లోతున, రెండోది 19 కిలోమీటర్ల లోతున సంభవించినట్లు అమెరికా భూభౌతిక సర్వే కేంద్రం తెలిపింది.