చైనాలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చైనా హైనాన్ రాష్ట్ర రాజధాని హైకౌర్‌లో మేయర్ స్థాయిలో విధులు నిర్వహించిన జాన్‌క్వీ కొన్ని వేల కిలోల బంగారాన్ని అక్రమంగా సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. అతను సంపాదించిన ఈ అక్రమ సొమ్ము ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఆ మొత్తం దాదాపు మన తెలుగు రాష్ట్రాల బడ్జెట్‌తో సమానమట.
జాన్‌క్వీ దాదాపు 13,500కిలోల బంగారం పోగేసినట్లు చైనా అధికారులు తేల్చారు. బంగారం విలువ రూ.2.68 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. జాన్‌క్వీ ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు పెద్ద పెద్ద ర్యాకుల్లో, ప్లాస్టిక్ సంచుల్లో మూటలు కట్టిన వేలాది బంగారు కడ్డీలు, బంగారు ఇటుకలు చూసి నివ్వెరపోయారు.
జాన్‌క్వీ ఈ బంగారాన్ని, డబ్బును కేవలం లంచాల ద్వారానే సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. ఇవే కాకుండా పలు విలాసవంతమైన విల్లాలను కూడా లంచంగా పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజం అలీబాబా వెబ్‌సైట్ అధినేత జాక్‌మా ఆస్తులకంటే జాన్‌క్వీ సంపదే ఎక్కువగా ఉంటుందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
- ఇదీ చూడండి: 50 కిలోల బంగారు దుర్గమ్మా.. చల్లగా చూడమ్మా..!