ETV Bharat / international

బంగ్లా పర్యటన పూర్తి.. భారత్​కు మోదీ - తీస్తా నదీ జలాల పంపిణీ

రెండు రోజుల పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్​కు వెళ్లిన ప్రధాని మోదీ.. తిరిగి భారత్​కు చేరుకున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తర్వాత విదేశీ పర్యటనకు ప్రధాని వెళ్లి రావడం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్​లో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఆ దేశ ప్రధాని షేక్​ హసీనాతో చర్చించారు.

PM Narendra Modi arrives at Delhi Airport
బంగ్లా పర్యటన పూర్తి.. భారత్​కు మోదీ
author img

By

Published : Mar 28, 2021, 6:33 AM IST

బంగ్లాదేశ్​కు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తిరిగి భారత్​కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా.. బంగ్లాదేశ్​ జాతీయ దినోత్సవ వేడుకలు, బంగబంధు షేక్​ ముజిబీర్​ రెహ్మాన్ శత జయంతి​ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అక్కడి చారిత్రక హిందూ దేవాలయాలను సందర్శించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఆ దేశ ప్రధాని షేక్​ హసీనాతో మోదీ చర్చించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తర్వాత విదేశీ పర్యటనకు ప్రధాని వెళ్లటం ఇదే తొలిసారి.

PM Narendra Modi arrives at Delhi Airport
దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రధాని మోదీ

'తీస్తా'పై కట్టుబడి ఉన్నాం...

తీస్తా నదీ జలాల పంపిణీ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ మేరకు బంగ్లాదేశ్​ ప్రధాన మంత్రి షేక్​ హసీనాతో జరిగిన భేటీలో ఆయన చర్చించారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్​ ష్రింగ్లా తెలిపారు.

"తీస్తా నదీ జలాల పంపకం ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని బంగ్లాదేశ్​ ప్రధాన మంత్రి షేక్​ హసీనాతో జరిగిన చర్చల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పెండింగ్​లోని ఫెనీ నదీ జలాల పంపకాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని భారత్​ కోరింది. ఇరు దేశాల మధ్య నదీ జలాల సహకారం కొనసాగుతుంది. "

-విదేశాంగ మంత్రి, హర్షవర్ధన్​ ష్రింగ్లా

ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ప్రవహిస్తున్న 56 దేశాల మధ్య సహకారం కొనసాగుతుందని హర్షవర్ధన్​ ష్రింగ్లా తెలిపారు. తాగునీరు, సాగునీరు, వరదల నియంత్రణ, కాలుష్య నియంత్రణ వంటి వాటిల్లో ఎలా కలిసి పనిచేస్తున్నామని చెప్పారు.

భారత్​, బంగ్లా మధ్య మరో రైలు..

బంగ్లాదేశ్​లోని ఢాకా నుంచి జల్​పాయ్​గుడి వరకు ప్యాసింజర్​ రైలును వీడియో కాన్ఫెరెన్సు ద్వారా.. ప్రధాని మోదీ, బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనా సంయుక్తంగా శనివారం ప్రారంభించారు. మిథాలీ ఎక్స్​ప్రెస్​ పేరుతో ఇది నడవనుంది.

బంగ్లాదేశ్​, భారత్​ మధ్య మిథాలీ ఎక్స్​ప్రెస్​ మూడోది. అంతకుముందు మైత్రీ ఎక్స్​ప్రెస్​ (ఢాకా-కోల్​కతా), బంధన్​ ఎక్స్​ప్రెస్​(ఖుల్నా-కోల్​కతా)లు ఇరు దేశాల మధ్య నడుస్తున్నాయి.

ఇదీ చూడండి:బంగ్లా 'చైనా కార్డు' ప్రయోగం- తెరపైకి 'తీస్తా' జలాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.