మారిషస్‌లోని సుప్రీం కోర్టు కొత్త భవనాన్ని నేడు ఆ దేశ ప్రధానమంత్రి ప్రవీంద్ కుమార్ జగ్‌నాథ్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమంలో మారిషస్ న్యాయవ్యవస్థ సీనియర్ సభ్యులు, ఇరు దేశాల ఉన్నతాధికారుల పాల్గొననున్నారు.
హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల మధ్య సహాకారంలో భాగంగా భారత్ అందించిన సాయంతో దేశ రాజధాని పోర్ట్ లూయీస్‌లో సుప్రీం కోర్టు భవనం నిర్మించారు. రాజధాని నగరంలో ఇలాంటి ప్రాజెక్టు చేపట్టటం ఇదే తొలిసారి.
మరో ఉదాహరణ..
సుప్రీం కోర్టు భవనం భారత్-మారిషస్ స్నేహబంధానికి మరో ఉదాహరణగా పేర్కొన్నారు ప్రధాని మోదీ. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు భవనం ప్రారంభించనున్నట్లు ట్వీట్ చేశారు. ఈ కీలక ప్రాజేక్టుకు సాయం అందించటం భారత్‌కు గర్వకారణమని పేర్కొన్నారు.
-
Another example of India-Mauritius friendship.
— Narendra Modi (@narendramodi) July 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
At 12 noon on 30th July, @MauritiusPM @PKJugnauth and I would jointly inaugurate, via video conferencing, the new Supreme Court Building of Mauritius. India is honoured to have assisted in this key project. https://t.co/kzHQLj7h9e
">Another example of India-Mauritius friendship.
— Narendra Modi (@narendramodi) July 29, 2020
At 12 noon on 30th July, @MauritiusPM @PKJugnauth and I would jointly inaugurate, via video conferencing, the new Supreme Court Building of Mauritius. India is honoured to have assisted in this key project. https://t.co/kzHQLj7h9eAnother example of India-Mauritius friendship.
— Narendra Modi (@narendramodi) July 29, 2020
At 12 noon on 30th July, @MauritiusPM @PKJugnauth and I would jointly inaugurate, via video conferencing, the new Supreme Court Building of Mauritius. India is honoured to have assisted in this key project. https://t.co/kzHQLj7h9e
10 అంతస్తుల్లో..
సుప్రీం కోర్టు భవనాన్ని 4,700 చదరపు మీటర్లు విస్తీర్ణంలో 10 అంతస్తుల్లో అధునాత హంగులతో నిర్మించారు. భవనం ప్రాంగణం 25,000 చదరపు మీటర్లు విస్తీర్ణం ఉంటుంది.
సుప్రీం కోర్టు భవనం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలంగా ఉన్నాయని సూచిస్తోందని పేర్కొంది భారత విదేశాంగ శాఖ. 2016లో భారత్ అందించిన 353 మిలియన్ డాలర్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ (ఎస్ఈపీ)లోని 5 ప్రాజెక్టుల్లో కోర్టు భవనం ఒకటని పేర్కొంది. అనుకున్న సమయానికి, తక్కువ ఖర్చులో నిర్మాణం పూర్తయినట్లు చెప్పుకొచ్చింది. భారత్ ఎస్ఈపీ కార్యక్రమంలో 2019, అక్టోబర్‌లో ప్రారంభమైన మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్టు, ఈఎన్టీ ఆసుపత్రి సహా 1000 ఇళ్ల నిర్మాణాలు వంటివి ఉన్నాయి.
ఇదీ చూడండి: 'గోల్డెన్ యారో' అంబాలా.. వాయుసేనలో కీలకం ఇలా!