ETV Bharat / international

కూలిన సైనిక విమానం- 45కు చేరిన మృతులు - plane crash

ఫిలిప్పీన్స్​లో జరిగిన సైనిక విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 45కు చేరింది. 49 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మొత్తం 96 మందితో వెళ్తున్న సైనిక విమానం సీ-130 సులు ప్రావిన్స్​లోని పర్వత ప్రాంత పట్టణం.. పాటికుల్ సమీపంలో కూలింది.

Philippine military plane crashes
కూలిన సైనిక విమానం
author img

By

Published : Jul 4, 2021, 9:59 PM IST

ఫిలిప్పీన్స్​లో సైనిక విమానం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 45కు చేరింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 96 మంది ఉన్నారు. వీరిలో 49 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మిగతా జవాన్ల కోసం ముమ్మరంగా సహాయక చర్యలు నిర్వహిస్తున్నట్లు రక్షణశాఖ వెల్లడించింది.

రన్​వే తప్పిపోయి..

military plane crashes
ఘటనా స్థలిలో సైనికులు
military plane crashes
ఎగిసి పడుతున్న మంటలు

96 మందితో వెళ్తున్న సైనిక విమానం సీ-130 సులు ప్రావిన్స్​లోని పర్వత ప్రాంత పట్టణం, పాటికుల్ సమీపంలో కూలింది. విమానం కూలిన సమయంలో.. కింద ఉన్న మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానం రన్ వేను తప్పిపోయినట్లు తెలుస్తోంది. మళ్లీ గాల్లోకి ఎగిరేందుకు పైలట్ ప్రయత్నించే క్రమంలో విమానం కూలిపోయినట్లు సమాచారం.

సైనికులను తరలిస్తుండగా..

military plane crashes
ఘటనా స్థలిలో విమాన శకలాలు

ప్రమాద సమయంలో.. విమానంలో ముగ్గురు ఫైలట్లు, ఐదుగురు విమాన సిబ్బంది, 88 మంది సైనికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కాగయాన్ డి ఓరో నగరం నుంచి సైనిక దళాలను వేరే ప్రాంతానికి తరలిస్తుండగా, ప్రమాదం జరిగిందని వివరించారు.

military plane crashes
కుప్పకూలిన మిలిటరీ విమానం

సులులో ప్రభుత్వ దళాలు దశాబ్దాలుగా అబూ సయ్యఫ్ ఉగ్రవాదులతో పోరాడుతున్నాయి. ఈ క్రమంలో ఉగ్రవాదంపై పోరాడే ఉమ్మడి టాస్క్‌ ఫోర్స్‌లో భాగంగా బలగాలను అక్కడ మోహరించేందుకు పంపినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి : ఏడు గంటల పాటు చైనా వ్యోమగాముల స్పేస్​వాక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.