ETV Bharat / international

పాక్ రైలు​ ప్రమాదంలో 65కు మృతుల సంఖ్య - పాక్ రైలు ప్రమాదంలో మృతులు

పాకిస్థాన్​లో రెండు ప్యాసెంజర్​ రైళ్లు ఢీ కొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 65కు పెరిగింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనే డిమాండ్​పై ఆ దేశ రైల్వే మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

train collision in Pakistan
పాకిస్థాన్​ రైలు ప్రమాదం
author img

By

Published : Jun 8, 2021, 2:45 PM IST

Updated : Jun 8, 2021, 3:56 PM IST

పాకిస్థాన్​లో సోమవారం రైళ్లు ఢీ కొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 65కు పెరిగింది. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. కాగ, ఈ ప్రమాదానికి గల కారణాలపై తక్షణమే దర్యాప్తు జరిపించాలని అక్కడి ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

ఎలా జరిగింది?

సోమవారం ఉదయం కరాచీ నుంచి సర్గోధాకు వెళ్తున్న మిల్లత్ ఎక్స్​ప్రెస్.. ధార్కి వద్ద పట్టాలు తప్పింది. దీంతో ఎదురుగా వస్తున్న సర్ సయద్ ఎక్స్​ప్రెస్.. మిల్లత్ రైలును ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళలు, రైల్వే అధికారులు సైతం మరణించారు. చాలా బోగీలు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యల కోసం ఆర్మీని రంగంలోకి దింపింది పాక్ ప్రభుత్వం.

సహాయక చర్యలు ముగిసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇంజన్ సహా 17 కోచ్​లను పట్టాల మీద నుంచి తప్పించారు. ఆ మార్గంలో రైల్వే సేవలు పునరుద్ధరించనున్నట్లు తెలిపారు.

అలా అయితే రాజీనామా..

ప్రమాదానికి బాధ్యత వహించి రాజీనామా చేయాలనే డిమాండ్​పై పాక్ రైల్వే మంత్రి అజామ్​ స్వాతి స్పందించారు. తన రాజీనామాతో చనిపోయినవారు బతికొస్తే.. అందుకు సిద్ధమేనని ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: మెట్రోరైలు ప్రమాదం: 23కు మృతుల సంఖ్య

Last Updated : Jun 8, 2021, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.