ETV Bharat / international

పాక్​లో 3 లక్షలు దాటిన కరోనా కేసులు - దక్షిణకొరియాలో కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2 కోట్ల 83 లక్షల మందికి పైగా కరోనా పాజిటివ్​గా తేలింది. 9లక్షల 14వేలకుపైగా కొవిడ్​ మరణాలు నమోదయ్యాయి. అమెరికా, బ్రెజిల్, రష్యాలో మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి పాకిస్థాన్​లో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది.

Pakistan's coronavirus cases cross 300,000-mark
పాకిస్థాన్​లో 3 లక్షలు దాటిన కరోనా కేసులు
author img

By

Published : Sep 11, 2020, 6:40 PM IST

కొవిడ్ ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి​. ఇప్పటి వరకు 2కోట్ల 83 లక్షల మందికి పైగా వైరస్​ బారినపడ్డారు.. 9లక్షల 14వేల మందికిపైగా మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. రికవరీల సంఖ్య 2 కోట్ల 3 లక్షలను దాటటం కొంత ఊరటనిస్తోంది.

  • కరోనా కేసులు అధికంగా ఉన్నఅమెరికాలో ఇప్పటివరకు 65.89 లక్షల మందికి వైరస్​ నిర్ధరణ అయ్యింది. అలాగే బ్రెజిల్​లో ఇప్పటివరకు 45.68 లక్షలకుపైగా కరోనా కేసులు బయటపడ్డాయి.
  • రష్యాలో కొత్తగా 5,504 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 10,46,370కు చేరింది. తాజాగా మరో 102 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 18,365కు చేరింది.
  • మెక్సికోలో మరో 4,857 మందికి వైరస్​ నిర్ధరణ అయ్యింది. మరో 554 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం 6,52,364 మంది బాధితులు ఉన్నారు. మొత్తం మృతుల సంఖ్య 69,646కు ఎగబాకింది.
  • దక్షిణ కొరియాలో కొత్తగా 176 కేసుల బయటపడగా.. మొత్తం కేసుల సంఖ్య 21,919కి చేరింది. 350 మంది మృతి చెందారు.
  • పాక్​లో కొత్తగా 548 మందికి కొవిడ్​ సోకింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3 లక్షలు దాటింది. ఇప్పటివరకు ఆ దేశంలో 6,370 మంది వైరస్​కు బలయ్యారు.
  • నేపాల్​లో తాజాగా 1,246 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఇప్పటివరకు ఆ దేశంలో 322 మంది కొవిడ్​తో మృతిచెందారు. మొత్తం బాధితుల సంఖ్య 51,919కి చేరింది.
దేశంకేసులుమరణాలు
అమెరికా65,89,020 1,96,345
భారత్​45,68,770 76,348
బ్రెజిల్​42,39,763 1,29,575
రష్యా10,51,87418,365
పెరూ7,10,067 30,344

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.