ETV Bharat / international

పాక్​లో తొలి హిందూ ఆలయ నిర్మాణం నిలిపివేత - శ్రీ కృష్ణాలయం పాకిస్థాన్​

పాకిస్థాన్​ రాజధాని ఇస్లామాబాద్​లో తలపెట్టిన తొలి హిందూ ఆలయ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలకు ఆమోదం లభించకపోవడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపినట్టు ఓ వార్తా పత్రిక నివేదించింది.

Pakistan halts Krishna temple construction in Islamabad
పాక్​లో తొలి హిందూ ఆలయ నిర్మాణం నిలిపివేత
author img

By

Published : Jul 5, 2020, 1:00 PM IST

పాకిస్థాన్​లోని తొలి హిందూ ఆలయానికి శంకుస్థాపన చేసిన కొద్ది రోజులకే.. నిర్మాణ పనులు నిలిచిపోయాయి. రాజధాని ఇస్లామాబాద్​లో తలపెట్టిన ఈ ఆలయానికి సంబంధించిన ప్రణాళికలకు ఆమోదం లభించకపోవడమే ఇందుకు కారణమని డాన్​ పత్రిక వార్త ప్రచురించింది.

కృష్ణుడి ఆలయం.. ఇస్లామాబాద్​లోని హెచ్​-9 పరిపాలన విభాగంలోకి వస్తుంది. ఆలయాన్ని 20వేల చదరపు అడుగుల విస్తీరణంలో నిర్మించాలనుకున్నారు. అయితే సరిహద్దు గోడ నిర్మాణాన్ని శుక్రవారం నిలిపివేసింది రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ. ఇందుకు చట్టపరమైన కారణాలున్నాయని వెల్లడించింది.

భవన నియంత్రణ విభాగం(బీసీఎస్​) అధికారులు శుక్రవారం ఆలయ నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని పర్యవేక్షించారు. అనంతరం ఆలయ నిర్మాణ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను చూపించాలని.. ఆ తర్వాత దానికి ఆమోదం లభిస్తేనే ముందుకు సాగాలని తెలిపారు.

అయితే.. ఆలయ శంకుస్థాపన వేడుకలో పాల్గొన్న పాకిస్థాన్‌ మానవ హక్కుల పార్లమెంటరీ కార్యదర్శి లాల్‌ చంద్‌ మల్హి మాత్రం.. ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను పంచాయత్..​ ఇప్పటికే మతవ్యవహారాల మంత్రిత్వశాఖకు సమర్పించిందని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన నివేదికనే ప్రధాని ఇమ్రాన్​ఖాన్​కు చూపించి ఆలయ నిర్మాణానికి 100 మిలియన్ రూపాయలు విడుదల చేయాలని మతవ్యవహారాల మంత్రి పీర్​ నూరుల్​ హక్​ అభ్యర్థించినట్టు వివరించారు.

ఇదీ చూడండి:- చైనాను కట్​ చేయకపోతే ఇక పాక్​ పని అంతే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.