కరోనా నియంత్రణ దిశగా అన్ని దేశాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. అయితే దాయాది పాకిస్థాన్ మాత్రం శనివారం లాక్డౌన్ను ఎత్తేసింది. ఇప్పటికే అక్కడ 28,000 వైరస్ కేసులు నమోదయ్యాయి. 618 మంది ప్రాణాలు కోల్పోయారు.
నిపుణుల హెచ్చరికలను పట్టించుకోకుండా..
ఆంక్షల సడలింపుపై ఇప్పటికే ప్రభుత్వాన్ని హెచ్చరించారు వైద్యులు. పాకిస్థాన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.
"మేం కేసుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నాం. కరాచీలోని ఆస్పత్రిలో కేవలం 63 పడకలనే కరోనా వార్డుకోసం సిద్ధం చేశారు. కరాచీ లాంటి నగరంలోనే పరిస్థితే ఇలా ఉంటే మిగతా చోట్ల ఎలా ఉందో ఊహించుకోవచ్చు."
-పాక్ మెడికల్ అసోసియేషన్
కేసులు పెరుగుతుండగానే లాక్డౌన్ ఎత్తేసింది పాక్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పాక్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చూడండి: 'గోడ' కోసం 275 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్