ETV Bharat / international

రాష్ట్రపతి విమానానికి పాక్​ అనుమతి నిరాకరణ

భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ప్రయాణించే విమానానికి పాకిస్థాన్​ గగనతలం మీదుగా వెళ్లేందుకు ఆ దేశం అనుమతి నిరాకరించింది. ఈ మేరకు భారత అధికారుల వినతిని తిరస్కరిస్తున్నట్లు పాక్​ విదేశాంగ మంత్రి వెల్లడించారు.

రాష్ట్రపతి విమానానికి పాక్​ అనుమతి నిరాకరణ
author img

By

Published : Sep 7, 2019, 4:59 PM IST

Updated : Sep 29, 2019, 7:06 PM IST

పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. ఐరోపా పర్యటనకు వెళతున్న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ప్రయాణించే విమానానికి పాక్​ గగనతలం మీదుగా వెళ్లేందుకు ఆ దేశం అనుమతి నిరాకరించింది.

రాష్ట్రపతి ఐరోపా పర్యటన నిమిత్తం పాక్‌ గగనతలం నుంచి వెళ్లడానికి ఆ దేశ అనుమతి కోరారు భారత అధికారులు. అయితే కోవింద్​ విమానం తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు నిరాకరిస్తున్నట్లు పాక్ విదేశాంగ మంత్రి ఎస్​ఎం ఖురేషీ వెల్లడించారు. విదేశాంగ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని పాక్​ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆమోదించినట్లు తెలిపారు.

కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి రద్దుతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఖురేషీ. కశ్మీర్​పై భారత్​ నిర్ణయం తీవ్రమైన సమస్యగా పేర్కొన్న ఆయన​.. ఈ అంశాన్ని ఐరాస మానవ హక్కుల మండలి దృష్టికి తీసుకెళతామన్నారు.

3 దేశాల పర్యటన..

సోమవారం నుంచి ఐస్​ల్యాండ్​, స్విట్జర్లాండ్​, స్లోవేనియా పర్యటన చేపట్టనున్నారు రాష్ట్రపతి కోవింద్​. ఆయా దేశాధినేతలతో సమావేశమవుతారు. పుల్వామా దాడి సహా ఇతర ఉగ్రవాద ఘటనలపై భారత స్వరం వినిపించనున్నారు కోవింద్​.

ఇదీ చూడండి: 'ఆర్టికల్ 370' ప్రత్యేక ప్రతిపత్తి కాదు : డోభాల్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 7 September 2019
1. Police running to clear protesters from station
2. Officers in riot gear inside station
3. Various of people and officers outside
4. Officer speaking into microphone
STORYLINE:
Police tried to clear protesters who had gathered at a station linked to Hong Kong's busy airport on Saturday.
The demonstrators were attempting to disrupt commutes to and from the city.
Activists have not called off plans for further protests even after Chief Executive Carrie Lam announced the decision to withdraw a controversial extradition bill that sparked the demonstrations three months ago.  
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.