తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కోర్టులో ఊరట లభించింది. వైద్య చికిత్స కోసం నాలుగు వారాలపాటు లండన్ వెళ్లేందుకు ఆయనకు లాహోర్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. వైద్యుల సలహా మేరకు ఈ గడువును మరికొంతకాలం పొడిగించే అవకాశం ఉంటుందని తెలిపింది.
నిషేధిత జాబితా నుంచి ..
విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించిన వ్యక్తుల జాబితా నుంచి షరీఫ్ పేరు తొలగించాలని లాహోర్ హైకోర్టు ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వానికి సూచించింది. బహుళ ఆరోగ్య సంక్లిష్టతల కారణంగా షరీఫ్ ప్లేట్‌లెట్ల సంఖ్య దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం ఆయన లాహోర్‌లోని తన నివాసం సమీపంలో ఏర్పాటు చేసిన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. లండన్‌లో వైద్య చికిత్స కోసం వెళ్లేందుకుగాను 7.5 బిలియన్ల బాండ్ సమర్పించాలన్న ఇమ్రాన్ సర్కార్ నిర్ణయంపై పీఎమ్ఎల్.... లాహోర్ హైకోర్టులో సవాల్ చేయటంతో.. తీర్పు అనుకూలంగా ఇచ్చింది.
ఇదీ చూడండి: హాంకాంగ్‌లో తొలిసారి బలగాలను మోహరించిన చైనా