తమ దేశ సముద్ర జలాల్లోకి ప్రవేశించబోయిన భారత జలాంతర్గామిని (Indian Submarine Pakistan) అడ్డుకొన్నామని పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. ఈ నెల 16న ఈ ఘటన జరిగిందని, సముద్ర గస్తీ విధులు నిర్వర్తించే తమ దేశ నేవీ విమానం(లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్) భారత జలాంతర్గామిని గుర్తించి హెచ్చరికలు చేయడంతో అది వెనక్కు మళ్లిందని పాకిస్థాన్ ఆర్మీ పేర్కొంది.
భారత జలాంతర్గాములు తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించేందుకు యత్నించడం ఇది మూడోసారని పాక్ వెల్లడించింది.
ఇదీ చూడండి: క్వాడ్ కొత్త కూటమి.. భారత్‌కు బలిమి!