ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో పాకిస్థాన్ మరోసారి భంగపడింది. కశ్మీర్ అంశంపై చర్చించాలన్న ప్రతిపాదనను భద్రతామండలి సభ్యదేశాలు నిరాకరించాయి. కశ్మీర్ సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హితబోధ చేశాయి.
కశ్మీర్ అంశంపై చర్చించేందుకు సభ్య దేశాలు తిరస్కరించటాన్ని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి అక్బరుద్దీన్ స్వాగతించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి రహస్య సమావేశంలో కశ్మీర్ అంశంపై చర్చించాలని పాక్ తరఫున చైనా బుధవారం డిమాండ్ చేసింది. ఈ విషయంపై గతంలో మాదిరిగానే వ్యతిరేకిస్తామని ఫ్రాన్స్ దౌత్య వర్గాలు ముందుగానే స్పష్టం చేశాయి. గత నెలలో ఐరాస రహస్య సమావేశంలో కశ్మీర్ గురించి చర్చించడానికి చైనా చేసిన ప్రయత్నాన్ని ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, రష్యా నిలువరించాయి.
ఇదీ చూడండి: కశ్మీర్‌పై చైనా వక్రబుద్ధి.. ఐరాసకు లేఖ