ETV Bharat / international

'పుల్వామా దాడి ఇమ్రాన్​ ప్రభుత్వ విజయం'

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో ఉగ్రదాడి చేసి 40 మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లను బలిగొన్నది తామేనని ఎట్టకేలకు పాకిస్థాన్​ అంగీకరించింది. ఇన్నాళ్లూ కాదని బుకాయించిన ఇమ్రాన్​ సర్కార్​.. సాక్షాత్​ ఆ దేశ పార్లమెంట్​లోనే ఈ విషయాన్ని వెల్లడించింది.

Pakistan accepts role in Pulwama attack
పుల్వామా దాడి మేమే చేశాం: పాకిస్థాన్
author img

By

Published : Oct 29, 2020, 6:15 PM IST

Updated : Oct 29, 2020, 6:47 PM IST

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో సీఆర్​పీఎఫ్​ వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని ఎట్టకేలకు పాకిస్థాన్​ ఒప్పుకొంది. సాక్షాత్​ ఆ దేశ మంత్రి.. పార్లమెంట్​లో ఈ మేరకు అంగీకరించారు. పైగా పిరికిపందలా దాడి చేయడాన్ని తమ ప్రభుత్వ విజయంగా అభివర్ణించారు. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలో సాధించిన ఈ విజయంలో మనమంతా భాగస్వాములేనని అన్నారు.

"మేము భారత్‌ను వారి దేశంలోకి చొచ్చుకెళ్లి దెబ్బకొట్టాం. పుల్వామాలో గెలుపు.... ఇమ్రాన్‌ఖాన్ నాయకత్వంలో ప్రజలు సాధించిన విజయం.

ఈ గెలుపులో మీరూ భాగమే. ఈ విజయంలో మనందరం భాగస్వాములమే."

- ఫవాద్ చౌదరి, పాకిస్థాన్ మంత్రి

పుల్వామాలో ఉగ్రదాడికి తాము బాధ్యులంకామంటూ అంతర్జాతీయ వేదికలపై ఇన్నాళ్లూ కల్లబొల్లి కబుర్లు చెప్పుకొచ్చింది పాకిస్థాన్. అయితే ఎట్టకేలకు పాక్ తన బండారాన్ని తానే బయటపెట్టుకుంది.

పుల్వామా దాడి...

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో 2019, ఫిబ్రవరి 14న సీఆర్​పీఎఫ్​ బలగాల వాహన శ్రేణిని పేలుడుపదార్థాలు నింపిన కారుతో ఉగ్రవాదులు ఢీకొట్టారు. నాటి ఘటనలో 40 మందికి పైగా భారత సైనికులు అమరులయ్యారు. దీనికి ప్రతిగా భారత వాయుసేన 2019, ఫిబ్రవరి 26న పాకిస్థాన్​ బాలాకోట్‌లోని జైషే మహ్మద్​ స్ఠావరాలపై బాంబులు విసిరింది. ఈ ఘటనలో 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు భారత వాయుసేన ప్రకటించింది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 29, 2020, 6:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.