పాక్ విదేశీ మారక నిల్వలను పెంచేందుకు గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా, యూఏఈలూ చెరో బిలియన్ డాలర్లు అందజేశాయి. కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోంది పాక్.
పాకిస్థాన్‌కు 6 బిలియన్ డాలర్లు ఆర్థిక సాయంగా అందిస్తామని గతేడాది అక్టోబరులో సౌదీ ప్రకటించింది. అందులో భాగంగానే ఇప్పుడు ఒక బిలియన్ డాలర్లు అందజేసింది. ఆర్థిక సాయం కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)తోనూ చర్చలు జరిపింది పాక్.
రుణ సదుపాయం కల్పిస్తే విదేశీ మారక నిలువలు బలపడటమే కాక, చెల్లింపుల స్థిరత్వంలో సమతుల్యత ఏర్పడుతుందని పాక్ అధికార ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు.