ETV Bharat / international

నగ్రోటా ఘటనపై భారత​ హైకమిషన్​కు పాక్​ సమన్లు - జమ్ముకశ్మీర్​ జైషే మహమ్మద్​

జమ్ముకశ్మీర్​లో అలజడులు సృష్టించేందుకు జైషే మహమ్మద్​ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారన్న భారత్​ ఆరోపణలను పాకిస్థాన్​ ఖండించింది. తమ దేశంలోని భారత హైకమిషన్​కు సమన్లు జారీ చేసి.. భారత ఆరోపణలపై మండిపడింది. ఈ విధంగా తప్పుడు లెక్కలు వేసుకోవద్దని సూచించింది.

v
నగ్రోటా ఘటనపై భారత​ హైకమిషన్​కు పాక్​ సమన్లు
author img

By

Published : Nov 22, 2020, 5:20 AM IST

జమ్ముకశ్మీర్​ స్థానిక ఎన్నికల్లో అలజడులు సృష్టించేందుకు జైషే మహమ్మద్​​ ప్రణాళికలు రచిస్తోందన్న భారత్​ ఆరోపణలను పాకిస్థాన్​ తిరస్కరించింది. ఈ మేరకు నగ్రోటా ఘటనపై భారత హైకమిషన్​కు సమన్లు జారీ చేసి.. భారత వ్యాఖ్యలను ఖండించింది.

ఉగ్రవాదులకు సహకరించడం మానుకోవాలని పాకిస్థాన్​ హైకమిషన్​కు భారత్ తేల్చిచెప్పిన కొద్ది గంటల వ్యవధిలో ఆ దేశం ఈ విధంగా స్పందించింది.​

మరోవైపు ఇదే విషయంపై పాకిస్థాన్​ విదేశాంగశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. నగ్రోటా ఘటనతో పాకిస్థాన్​కు సంబంధం లేదని.. తప్పుడు లెక్కలు వేసుకునే అలవాటును భారత్​ మానుకోవాలని పేర్కొంది.

జమ్ముకశ్మీర్​ నగ్రోటాలో.. గురువారం ఉదయం నలుగురు జైషే మహమ్మద్​ అనుమానిత ఉగ్రవాదులను భారత భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. భద్రతా దళాల అప్రమత్తత వల్ల భారీ ఉగ్రకుట్ర భగ్నమైందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- 'ఇలా అయితే మేం పాకిస్థాన్​‌ నుంచి వెళ్లిపోతాం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.