ETV Bharat / international

లాడెన్​​ అమరవీరుడంటూ కీర్తించిన ప్రధాని

pak pm
ప్రధాని
author img

By

Published : Jun 25, 2020, 7:05 PM IST

Updated : Jun 25, 2020, 8:38 PM IST

19:02 June 25

లాడెన్​​ అమరవీరుడంటూ కీర్తించిన ప్రధాని

  • #WATCH America came inside Pakistan and killed and martyred Osama Bin Laden. After which all the countries cursed us. Pakistan has faced humiliation for many years in war on terror, says Pak PM Imran Khan in National Assembly (Video Source: Pak media) pic.twitter.com/LbfmKDAs6a

    — ANI (@ANI) June 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పాకిస్థాన్​ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని భారత్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. ఒకానొక సందర్భంలో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ బహిరంగంగానే అంగీకరించారు. గత ప్రభుత్వాలు ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చాయని వెల్లడించారు. అయితే ఓవైపు ఆశ్రయం ఇచ్చామని చెబుతూనే ఉగ్రవాదం కారణంగా పాకిస్థాన్​ బలైందని పొంతన లేకుండా వాదించారు.  

ప్రస్తుతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు ఇమ్రాన్​. ఈ సారి మరో మెట్టు పైకెక్కి అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్​ లాడెన్​ను 'అమరవీరుడు' అని కీర్తించారు. అదీ పాకిస్థాన్ పార్లమెంటు సాక్షిగా..  ఆపై పాక్​ ఉగ్రవాద బాధిత దేశమని మరోసారి అసంబద్ధంగా వాదించారు. పాక్​ జాతీయ అసెంబ్లీలో గురువారం ఓ అంశంపై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్ ఖాన్.  

"ఉగ్రవాదంపై పోరులో అమెరికాకు మద్దతుగా నిలిచాం. ఆ విషయంలో మనకు నష్టమే జరిగింది. అఫ్గానిస్థాన్​ సంబంధించిన విషయంలోనూ పాక్ పైనే నిందలు వేశారు. ఉదాహరణకు ఓ ఘటన చెబుతా. ఈ విషయంలో మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం.  

అబోటబాద్​లో ఒసామా బిన్​ లాడెన్​ను అమెరికా సేనలు చంపేశాయి. లాడెన్​ అమరుడయ్యాడు. తర్వాత ఏమైంది? ప్రపంచమంతా పాకిస్థాన్​నే తప్పుబట్టాయి. ఉగ్రవాదంపై పోరులో 10 ఏళ్లుగా నిందలు ఎదుర్కొంటూ వస్తున్నాం. అమెరికా మన దేశంలోకి వచ్చి ఒకర్ని చంపేవరకూ ఆ విషయం మనకు తెలియదు."

- ఇమ్రాన్ ఖాన్​, ప్రధానమంత్రి

Last Updated : Jun 25, 2020, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.