ETV Bharat / international

విపక్షాలపై బెదిరింపులకు పాల్పడిన పాక్​ మంత్రి! - తాలిబన్​ దాడులు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడిన విపక్ష పార్టీలపై తాలిబన్​ దాడుల బెదిరింపులకు పాల్పడ్డారు పాకిస్థాన్​ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇజాజ్​ షా. ఇటీవల తన నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్​గా మారింది. మంత్రి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డాయి విపక్షాలు.

Ijaz shah
పాకిస్థాన్​ అంతర్గత మంత్రి ఇజాజ్​ షా
author img

By

Published : Nov 3, 2020, 5:02 AM IST

పాకిస్థాన్​లో అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. పాక్​ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఇజాజ్​ షా.. తాజాగా విపక్షాలపై తాలిబన్​ దాడులు జరుగుతాయని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆయనకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉండటం గమనార్హం.

ఇటీవల నాన్​కనా సాహిబ్​లోని తన నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు బెదిరింపులకు పాల్పడ్డారు మంత్రి ఇజాజ్​. 'తీవ్రవాదంపై అవామీ నేషనల్​ పార్టీ(ఏఎన్​పీ) విధానలకు వ్యతిరేకంగా వారి నాయకత్వంపై కొద్ది రోజుల క్రితం తెహ్రీక్​ హీ తాలిబన్​ సంస్థ దాడులు చేసింది. బషిర్​ బిలౌర్​, మియాన్​ ఇఫ్తీఖర్​ కుమారుడు సహా పలువురు కీలక నేతలు మృతి చెందారు. ఈ రోజు, విపక్ష కూటమిని అనుసరించే వారి భద్రత కోసం నేను ప్రార్థిస్తున్నా. వారు దైవ మార్గదర్శకత్వం పొందాలని కోరుకుంటున్నా.' అని పేర్కొన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

రాజీనామాకు డిమాండ్​

మంత్రి ఇజాజ్​ షా వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డాయి విపక్ష పార్టీలు. దేశ ప్రజలులతో పాటు ఉగ్రవాదుల చేతుల్లో కార్యకర్తలను కోల్పోయిన పార్టీలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేసింది పాకిస్థాన్​ పీపుల్స్​ పార్టీ(పీపీపీ). ఉగ్రవాదంపై నేషనల్​ యాక్షన్​ ప్లాన్​ (ఎన్​ఏపీ)ను ఉల్లంఘించటమేనని పేర్కొంది. ఇజాజ్​ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్​ చేసింది ఏఎన్​పీ. అలాంటి వ్యాఖ్యలు ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తున్నారన్న ఆరోపణలను ధ్రువీకరిస్తాయని, దేశానికి వ్యతిరేకంగా ఉన్న ప్రపంచ వాదనను బలపరుస్తాయని పేర్కొన్నట్లు డౌన్ పత్రిక వెల్లడించింది.

ఇదీ చూడండి: పాకిస్థాన్​​ ప్రతిపక్షనేతపై దేశద్రోహం కేసు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.