ETV Bharat / international

చైనా, రష్యాలతో పాక్ రహస్య మంతనాలు.. కారణమిదే! - ఐఎస్‌ఐ చీఫ్‌

తాలిబన్ల అధ్యక్షతన అఫ్గాన్‌తో(Taliban Afghanistan) నెలకొల్పే సత్సంబంధాలపై(Pakistan Afghanistan) చైనా, రష్యా సహా పలు దేశాల ఉన్నతాధికారులతో పాకిస్థాన్​ ఐఎస్​ఐ చీఫ్​ (Pakistan Isi Chief) రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఆయా దేశాల ఇంటెలిజెన్స్‌ అధికారులతో పాకిస్థాన్‌ ఇంటెల్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) డైరెక్టర్‌ జనరల్‌ ఫయాజ్‌ హమీద్‌​ ఇస్లామాబాద్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

Pakistan Isi Chief
ఐఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ ఫయాజ్‌ హమీద్‌
author img

By

Published : Sep 12, 2021, 9:30 AM IST

తాలిబన్ల నేతృత్వంలోని అఫ్గాన్‌ ప్రభుత్వంతో(Taliban Government) సత్సంబంధాలపై(Pakistan Afghanistan) పలు దేశాల ఉన్నతాధికారులతో పాక్‌ ఐఎస్‌ఐ చీఫ్‌(Pakistan Isi Chief) రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. చైనా, రష్యా, ఇరాన్, కజకిస్థాన్‌, తజికిస్థాన్‌, తుర్కెమెనిస్థాన్‌ దేశాల ఇంటెలిజెన్స్‌ అధికారులతో పాకిస్థాన్‌ ఇంటెల్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) డైరెక్టర్‌ జనరల్‌ ఫయాజ్‌ హమీద్‌ ఇస్లామాబాద్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. తాలిబన్ల(Taliban Afghanistan) పిలుపు మేరకు కాబుల్‌ వెళ్లి వచ్చిన తర్వాత ఫయాజ్‌ హమీద్‌ ఈ భేటీ ఏర్పాటు చేయడం పలు ఊహాగానాలకు తెరలేపుతోంది.

సుదీర్ఘ చర్చలు!

నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. అఫ్గాన్‌లోని ప్రస్తుత పరిస్థితులపై ఆయా దేశాలు చేపట్టబోయే చర్యలతోపాటు తాలిబన్ల అధ్యక్షతన అఫ్గాన్‌తో పాక్‌ నెలకొల్పే సత్సంబంధాలను ఐఎస్​ఐ చీఫ్​(Pakistan Isi Chief) చర్చించినట్లు సమాచారం. అఫ్గాన్‌తో ఆర్థిక, వాణిజ్య పరమైన సంబంధాలపై(Pakistan Afghanistan) సుదీర్ఘ చర్చలు సాగించారు. రష్యా మినహా మిగతా ఐదు దేశాల విదేశాంగ మంత్రులు ఇదే అంశంపై గతవారం విస్తృత చర్చలు నిర్వహించారు.

పాకిస్థాన్‌, చైనాతోపాటు మరికొన్ని దేశాలు తాలిబన్లకు మొదటినుంచి మద్దతిస్తున్నాయి. తాలిబన్ల పాలనకు అనుకూలంగానే మాట్లాడుతూ వస్తున్నాయి. పలు దేశాలు తాలిబన్లకు ఆయుధాలు సరఫరా చేశాయని, ఆర్థిక సాయం అందించాయని వార్తలు కూడా వచ్చాయి. అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఈమధ్యే తమ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా.. పాకిస్థాన్‌, చైనా, రష్యా, టర్కీ, కతర్‌, ఇరాన్‌ దేశాలకు ఆహ్వానం కూడా పంపించారు. అయితే పలు కారణాలతో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిలిపివేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.