ETV Bharat / international

ముంచెత్తిన వరద- ఏడుగురు మృతి

సెంట్రల్ నేపాల్​లో వరద బీభత్సం సృష్టించింది. వివిధ ఘటనల్లో ఏడుగురు మరణించారు. సింధుపాల్​చౌక్​ జిల్లాలోని అనేక ఇళ్లు నీటమునిగాయి. ఈ వరదల్లో చిక్కుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

nepal, flood
నేపాల్, వరదలు
author img

By

Published : Jun 16, 2021, 12:10 PM IST

Updated : Jun 16, 2021, 6:40 PM IST

సెంట్రల్​ నేపాల్ సింధుపాల్​చౌక్​ జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. భారీగా కురిసిన వర్షాల కారణంగా ఇంద్రావతి, మేలమ్చి నదుల్లో వరదలు పోటెత్తాయి. ఫలితంగా ఏడుగురు మృతిచెందగా.. 50 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.

నేపాల్​లో ముంచెత్తిన వరద

"మేలమ్చి, ఇంద్రావతి నదుల్లో భారీగా నీటి శాతం పెరిగినందునే వరదలు సంభవించాయి. హెలంబు ప్రాంతం నుంచి వరద నీటి ప్రవాహం మొదలైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేశాం. చాలా మంది గల్లంతయ్యారని సమాచారం అందింది."

-అరుణ్ పోఖ్రేల్, అధికారి.

మేలమ్చి నది సమీప ప్రాంతాల్లో.. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. వరద ధాటికి కొన్ని వంతెనలు కూలిపోయాయి. కరెంట్ స్తంభాలు దెబ్బతినగా విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 300కు పైగా గుడిసెలు నేలమట్టం అయ్యాయి.

nepal, flood
భారీగా పోటెత్తిన వరద
nepal, flood
నేపాల్​లో వరద బీభత్సం
nepal, flood
నీట మునిగిన ఇళ్లు

ఇదీ చదవండి:దెహ్రాదూన్​లో మెరుపు వరద- దెబ్బతిన్న రోడ్లు

Last Updated : Jun 16, 2021, 6:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.