కరోనా వ్యాప్తిని నివారించేందుకు చైనా అధికారులు వినూత్న మార్గాన్ని అనుసరిస్తున్నారు. ప్రభుత్వ బస్సులు, లిఫ్టుల్లో కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు అతినీలలోహిత కాంతిని ప్రసారం చేస్తున్నారు.
చైనాలో కరోనా మహమ్మారి బారిన పడి 3,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విలయతాండవానికి కారణమైన కరోనాను రూపుమాపడానికి కఠినమైన నివారణ చర్యలు చేపట్టాలని కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయి. దీనితో అప్రమత్తమైన అధికారులు ప్రతిదీ శుభ్రంగా ఉంచడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానం వైపు మొగ్గు చూపుతున్నారు.
యూవీ లైట్‌తో
షాంఘై ప్రజా రవాణా సంస్థ యాంగ్గావ్... బస్సులను శుభ్రపరిచేందుకు రెండు సాధారణ గదులను క్రిమిసంహారక గదులుగా మార్చింది. ఇవి ఒక్కొక్కటి రోజుకు 250 బస్సులను యూవీ కిరణాలు ప్రసరింపజేసి శుభ్రపరుస్తాయి. ఫలితంగా మానవ వనరుల వినియోగం బాగా తగ్గింది. ఫలితంగా 40 నిమిషాలు పట్టే ప్రక్రియ 5 నిమిషాలకు తగ్గింది.
"సాధారణంగా బస్సులో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడానికి ఇద్దరు సిబ్బంది అవసరం. అయినప్పటికీ బస్సులో ప్రతి మూలా పిచికారీ చేయడం సాధ్యం కాకపోవచ్చు. ప్రస్తుత యూవీ రేస్ ప్రసారం వల్ల బస్సులోని ప్రతి భాగం కూడా శుభ్రపరచడానికి వీలవుతోంది."
- క్విన్ జిన్, యాంగ్గావ్ ప్రజా రవాణా వ్యవస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్
హెచ్చరిక
'ముందుగా సిబ్బంది... బస్సును 210 యూవీ గొట్టాలు ఉన్న గదిలోకి ఓ సారి తీసుకెళ్తారు. యూవీ కిరణాల వల్ల మనుష్యులకు చర్మ సంబంధింత ఇబ్బందులు వస్తాయి. కనుక సిబ్బంది వెంటనే ఈ గదుల నుంచి బయటకు వచ్చేస్తారు. తరువాత అతినీల లోహిత కిరణాలతో బస్సును శుభ్రపరుస్తారు' అని క్విన్ జిన్ తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా ముప్పుతో స్వీయ నిర్బంధంలోకి ప్రధాని