ETV Bharat / international

Covid Endemic Phase: ఒమిక్రాన్​ ఎంట్రీతో.. ముగిసిన మహమ్మారి దశ! - omicron spread news

Covid Endemic Phase: కొవిడ్ మహమ్మారి తీవ్రత తగ్గి మహమ్మారి నుంచి 'ఎండెమిక్​'గా మారిపోతుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు ఒమిక్రాన్‌ పుట్టుక మొదటి అడుగు కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.

covid virus
కొవిడ్​-19
author img

By

Published : Dec 1, 2021, 7:01 AM IST

Covid Endemic Phase: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొవిడ్‌-19 ఉపశమించనుందా? 'మహమ్మారి'గా ఉన్న ఈ వ్యాధి తీవ్రత తగ్గనుందా? ఎప్పటికీ ఉండిపోయే సాధారణ ఇన్‌ఫెక్షన్‌ (ఎండెమిక్‌)లా ఇది మారిపోతుందా? ఈ ప్రశ్నలకు కొందరు శాస్త్రవేత్తలు ఔననే సమాధానమిస్తున్నారు. కరోనాలో కొత్తగా వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇందుకు దోహదపడొచ్చని వారు చెబుతున్నారు.

ఎండెమిక్​గా కొవిడ్..

ఒమిక్రాన్‌ వల్ల తీవ్రస్థాయి వ్యాధికి పెద్దగా ఆస్కారం లేదని ఆఫ్రికా నుంచి వస్తున్న వార్తలను బట్టి ప్రాథమికంగా స్పష్టమవుతోంది. అయితే దీనికి సంబంధించిన డేటా చాలా పరిమితంగానే ఉన్నందువల్ల అప్రమత్తత కొనసాగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది.

సాధారణంగా జనాభాలో ఎక్కువ శాతం మందిలో పాగా వేశాక వైరస్‌లు తీవ్రస్థాయి వ్యాధిని కలిగించలేవు. ఇందుకు ప్రధాన ఉదాహరణ మిక్సోమెటోసిస్‌ వ్యాధి. ఆస్ట్రేలియాలో ఇది తొలిసారి ప్రబలినప్పుడు అక్కడ 99 శాతం కుందేళ్లు మృత్యువాత పడ్డాయి. ఇప్పుడు అది బలహీనపడింది. ఫలితంగా ఆ వ్యాధితో చనిపోతున్న కుందేళ్ల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది.

కొవిడ్‌ మహమ్మారి కూడా ఇదే తరహాలో తీవ్రత తగ్గి, 'ఎండెమిక్‌'లా మారుతుందని కొందరు నిపుణులు ఇప్పటికే అంచనాలు వేశారు. ఫలితంగా నిర్దిష్ట ప్రాంతంలో ఆ వ్యాధి తీరుతెన్నులను చాలా మెరుగ్గా ఊహించే స్థితిలో నిపుణులు ఉంటారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ పుట్టుక.. ఈ ప్రక్రియ దిశగా మొదటి అడుగు కావొచ్చని ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తాజాగా చెబుతున్నారు.

కొన్ని వేరియంట్ల ఆధిపత్యం ఎందుకు?

మునుపటి రకాలతో పోలిస్తే వేగంగా వ్యాపించే సామర్థ్యాన్ని చాటే కొత్త వేరియంట్లు బాగా విస్తరిస్తాయని పరిణామక్రమ జీవశాస్త్రం చెబుతోంది. 'ఆర్‌ సంఖ్య'(ప్రాథమిక పునరుత్పత్తి సంఖ్య లేదా వ్యాధి సోకిన వ్యక్తి నుంచి సరాసరిన ఎంతమందికి ఆ వైరస్‌ వ్యాపిస్తుందో చెప్పే సంఖ్య) అధికంగా ఉన్న రకాలు.. తక్కువగా ఉన్న వేరియంట్ల స్థానాన్ని ఆక్రమిస్తాయని స్పష్టమవుతోంది. దీనికితోడు ఒక వ్యక్తిలో వ్యాధి సోకాక అతడి నుంచి ఇతరులకు ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించడానికి మధ్య కొంత సమయం ఉంటుంది. ఈ వ్యవధి ఎక్కువగా ఉండే రకాలు.. ఈ విరామం తక్కువగా కలిగిన వేరియంట్ల స్థానాన్ని ఆక్రమించేస్తాయి. డెల్టా వేరియంట్‌ విషయంలో ఇదే జరిగింది.

కొత్త వేరియంట్‌ ఏ జనాభాలో ఉత్పన్నమైందన్నది కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అధికస్థాయిలో వ్యాక్సినేషన్‌ పొందిన సమాజంతో పోలిస్తే టీకా విస్తృతి తక్కువగా ఉన్నచోట్ల ఈ వ్యాధి పరిణామక్రమం భిన్నంగా ఉంటుంది. ఒమిక్రాన్‌ తొలుత వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో వ్యాక్సినేషన్‌ రేటు 25 శాతంగానే ఉంది. ఇలాంటి చోట్ల 'ఆర్‌ సంఖ్య' ఎక్కువగా ఉన్న రకాలు ఉత్పన్నం కావడానికి ఆస్కారం ఉంటుంది. విస్తృత స్థాయిలో టీకా పొందిన జనాభాలో.. వ్యాక్సిన్‌ను ఏమార్చే రకాలు పైచేయి సాధించొచ్చు.

తక్కువ లక్షణాలు ఉంటే విస్తృతి అధికం

వ్యాధి లక్షణాలు, వ్యాప్తి తీవ్రతకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. వ్యాధి లక్షణాలు తక్కువగా ఉంటే ప్రజలు నిర్ధారణ పరీక్షలకు పెద్దగా ముందుకు రాకపోవచ్చు. తమకు కొవిడ్‌ సోకిందనే విషయాన్నే కొందరు గుర్తించలేరు. అందువల్ల తీవ్ర లక్షణాలను పెద్దగా కలిగించని రకాలు.. అధిక లక్షణాలను కలిగించే వేరియంట్లతో పోలిస్తే ఉద్ధృతంగా వ్యాపించొచ్చు.

మరోపక్క డెల్టా రకంలో కనిపించినట్లు.. కొన్ని వేరియంట్ల వల్ల రోగి శరీరంలో వైరస్‌ అధికస్థాయిలో ఉండొచ్చు. అది ఎంత ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి నుంచి అంత అధికంగా ఇతరులకు వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి రకాల వల్ల ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత కూడా అధికంగా ఉండొచ్చు.

ఒమిక్రాన్‌లో ఇవి తేలాలి

ఆఫ్రికాలో ఒమిక్రాన్‌ ఎందుకు అంత తీవ్రంగా వ్యాపిస్తుందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇతర రకాలతో పోలిస్తే ఈ వేరియంట్‌ వల్ల అధిక వైరల్‌ లోడు ఉంటుందా అన్నది ఇంకా తేలలేదు. వైరస్‌ వ్యాప్తి అనేది సంక్లిష్టమైన, బహుళ అంచెల ప్రక్రియ. ఒమిక్రాన్‌కు అధిక వ్యాప్తిరేటు ఉండటానికి అనేక కారణాలు దోహదపడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ వేరియంట్‌ వల్ల కలిగే వైరల్‌ లోడు, ప్రస్తుత టీకాలు లేదా గతంలో వచ్చిన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా వెలువడిన రోగ నిరోధక స్పందనను అది ఎంత వరకూ ఏమారుస్తుందన్నది నిర్ధరించాల్సి ఉంది.

అయితే కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాల్సిన ఆవశ్యకతను కొత్త వేరియంట్‌ పుట్టుక సూచిస్తోంది.

ఇదీ చూడండి: దక్షిణాఫ్రికా హెచ్చరించక ముందే.. ఆ దేశాల్లో ఒమిక్రాన్​ వ్యాప్తి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.