ఆస్ట్రేలియాలోనే కురు వృద్ధుడిగా పేరు గాంచిన డెక్స్టర్ క్రుగర్ ప్రస్తుత వయస్సు 111 ఏళ్ల 124 రోజులు. ఇప్పటికీ అంత ఆరోగ్యంగా ఉండడం వెనుక రహస్యాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఆయన. తాను కోడి మెదడును ఇష్టంగా తింటానని.. అందుకే ఇంతకాలం జీవించి ఉన్నానని, ఇప్పటికీ చురుగ్గా ఉండగలుగుతున్నానని తెలిపారు.




"కోడికి తల ఉంటుందని మనకు తెలుసు.అయితే ఆ తలలో మెదడు ఉంటుంది. అది చాలా సున్నితంగా ఉండే చిన్న పదార్థం." అని శతాధిక వృద్ధుడు క్రుగర్ చెప్పుకొచ్చారు. తాను గతంలో పశు సంపదను వృద్ధి చేసే విభాగంలో పని చేసేవాడినన్నారు. తన జీవిత విశేషాలను కలిపి ఆత్మకథ కూడా రాశానన్నారు.
గతంలో ఆస్ట్రేలియాలోనే అత్యంత వృద్ధుడిగా ఉన్న క్రిస్టినా కుక్( 114) 2002లో మరణించారు.
ఇదీ చదవండి : ఫోన్ లాక్కున్న కోతి.. చివరికి ఏమైంది?