ETV Bharat / international

అఫ్గాన్​లో ఆత్మాహుతి దాడి.. 18 మంది మృతి - కాబుల్​లో ఆత్మాహుతి దాడి

అఫ్గానిస్థాన్​ కాబుల్​లోని ఓ విద్యాకేంద్రం వెలుపల బాంబుదాడి జరిగింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో చాలా మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. మరో 50 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

Official: Bombing in Kabul kills 18, including children
అఫ్గాన్​లో ఆత్మాహుతి దాడి..చిన్నారుల సహా 18మంది మృతి
author img

By

Published : Oct 24, 2020, 10:20 PM IST

Updated : Oct 24, 2020, 10:37 PM IST

అఫ్గానిస్థాన్ కాబుల్​లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.

కాబుల్​లోని ఓ విద్యాకేంద్రం వెలుపల పేలుడు జరిగినట్లు అఫ్గానిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి తరీఖ్ అరియన్ వెల్లడించారు. ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తి లోనికి ప్రవేశిస్తుండగా.. భద్రతా సిబ్బంది అడ్డుకున్న సమయంలో ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. ఈ దుర్ఘటనకు తామే కారణమని ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ ప్రకటించలేదు.

అఫ్గాన్​లో తాలిబన్లు, బలగాల మధ్య మళ్లీ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. దశాబ్దాల యుద్ధానికి తెరదించేందుకు దోహాలో శాంతి చర్చలు జరిగినప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు.

తూర్పు అఫ్గానిస్థాన్​లో శనివారం ఉదయం ఓ రోడ్డుపక్కన బాంబు పేలింది. పౌరులతో ఉన్న మినీ వ్యాన్​ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో.. 9 మంది మరణించారు. ఘజ్ని రాష్ట్రంలో జరిగిన మరో పేలుడు ఘటనలో ఇద్దరు పోలీసులు చనిపోయారు. మొదటి బాంబు దాడిలో గాయపడిన వారికి సహాయ చర్యలు అందిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అయితే ఈ దాడులకు తాలిబన్లే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Last Updated : Oct 24, 2020, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.