ETV Bharat / international

గొడ్డలితో పార్లమెంట్​ తలుపులు బద్దలు కొట్టి.. - గొడ్డలితో పార్లమెంటులోకి

న్యూజిలాండ్​ పార్లమెంటు భద్రతపై సమీక్ష నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. ఓ దుండగుడు పార్లమెంటు ప్రవేశద్వారం తలుపులను గొడ్డలితో బద్దలుకొట్టిన నేపథ్యంలో.. భద్రతపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

NZ to review parliament security after door attack
గొడ్డలితో పార్లమెంటులోకి- అధికారులు అప్రమత్తం
author img

By

Published : Jan 13, 2021, 3:31 PM IST

న్యూజిలాండ్​ పార్లమెంటులో భద్రతపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. బుధవారం ఓ దుండగుడు.. ప్రవేశద్వారం గాజు తలుపులను గొడ్డలితో బద్దలుకొట్టాడు. ఈ నేపథ్యంలో.. పార్లమెంటు భద్రతపై సమీక్ష నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.

వెల్లింగ్టన్​లో పార్లమెంటు కాంప్లెక్స్​లో ఓ 31 ఏళ్ల వ్యక్తి గొడ్డలి పట్టుకొని ఉన్నట్లు సమాచారం మేరకు.. ఉదయం 5.30 గంటలకే అక్కడికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. అప్పటికే తలుపులను పగలకొట్టాడని, తక్షణమే అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అయితే.. దుండగుడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించలేదని స్పష్టం చేశారు.

NZ to review parliament security after door attack
తలుపులను బద్దలుకొట్టిన దుండగుడు

నేలపై పడిఉన్న గాజుముక్కలు

ఏడేళ్ల జైలు..!

నిందితుడిపై ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడం, ప్రమాదకర ఆయుధాన్ని కలిగి ఉండటం వంటి అభియోగాలు మోపారు. దోషిగా తేలితే అతడికి కోర్టు ఏడేళ్ల జైలు విధించే అవకాశం ఉంది.

గాజుముక్కలను తొలగిస్తున్న సిబ్బంది

అయితే.. ఇటీవల అమెరికా క్యాపిటల్​ హిల్​ భవనంలో జరిగిన దాడిని ప్రేరణగా తీసుకొనే న్యూజిలాండ్​ పార్లమెంటుపై దాడి చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఈ కోణంలోనూ అతడిని విచారించనున్నారు.

న్యూజిలాండ్​లో 120 మంది చట్టసభ్యులు.. వేసవి సెలవుల్లో ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో కొద్ది మంది మాత్రమే పార్లమెంటులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: 'క్యాపిటల్​ దాడి'పై సైనికాధికారుల సంయుక్త ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.