ETV Bharat / international

ఫ్రీగా టీకాలు ఇస్తున్నా వద్దంటున్న ఉత్తర కొరియా - ఉత్తర కొరియా వార్తలు

దశల వారీగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహమ్మారి నుంచి రక్షణకు ప్రపంచ దేశాలు ప్రజలకు పూర్తిస్థాయిలో టీకా అందించే దిశగా కృషి చేస్తున్నాయి. కొన్ని దేశాలు ఇంకా సరిపడా డోసుల కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే ఉత్తర కొరియా (North korea vaccine) మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. వ్యాక్సిన్లు అందిస్తామన్నా.. అవసరం లేదని, కరోనా తీవ్రంగా ఉన్న దేశాలకు పంపిణీ చేయండని సూచించింది.

North korea vaccine
టీకాలు అవసరం లేదంటున్న ఉత్తర కొరియా!
author img

By

Published : Sep 1, 2021, 3:48 PM IST

కరోనాను కట్టడి చేశామని, తమ దేశంలో ఒక్క వైరస్​ కేసు కూడా నమోదు కాలేదని చెప్పుకొస్తున్న ఉత్తర కొరియా.. ఇప్పుడు అసలు తమకు టీకాలే అవసరం లేదంటోంది. యూఎన్​ ఆధ్వర్యంలోని కొవాక్స్​ కార్యక్రమంలో భాగంగా ఉత్తర కొరియాకు పంపిణీ చేసే వ్యాక్సిన్లను (North korea vaccine) కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న దేశాలకు సరఫరా చేయమని యూఎన్​కు ప్రతిపాదించింది. ఈ విషయాన్ని యూనిసెఫ్​ వెల్లడించింది.

వ్యాక్సిన్​ పంపిణీలో భాగంగా యూనిసెఫ్​.. 29.7 లక్షల సినోవాక్​ టీకా డోసులను ఉత్తర కొరియాకు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఈ వ్యాక్సిన్లు తమకు అవసరం లేదంటూ ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. భవిష్యత్తులో అవసరమైతే సంప్రదిస్తామంటూ ఆరోగ్య శాఖ పేర్కొందని యూనిసెఫ్​ వెల్లడించింది. ఇప్పటికే ఉత్తర కొరియాకు 19 లక్షల డోసులను యూఎన్​ కేటాయించింది.

వ్యాక్సిన్లు అంటే లెక్కేలేదు..

వ్యాక్సిన్ల సామర్థ్యంపై అనుమానాల వల్లే ఉత్తర కొరియా ఈ వైఖరి ప్రదర్శిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. కరోనా కట్టడి కోసం సరిహద్దుల వద్ద బందోబస్తు పెంచడం, కఠిన ఆంక్షలతో క్వారంటైన్​లను ఏర్పాటు చేయడం తప్ప వ్యాక్సిన్​ పంపిణీకి ఆ దేశం ప్రాధాన్యం ఇవ్వట్లేదన్నారు.

ఇప్పటివరకు ఒక్క కరోనా వైరస్​ కేసు కూడా నమోదు కాలేదంటూ ఉత్తర కొరియా పేర్కొనడం గమనార్హం. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థకు పంపిన నివేదికలో.. 37,291 మందికి పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగిటివ్​ వచ్చిందని పేర్కొంది.

ఇదీ చదవండి : Afghanistan US Troops: అమెరికా తొందరపాటు- శునకాల ఆకలికేకలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.