కరోనాను అరికట్టేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చి ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. చైనా అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. యుద్ధ ప్రాతిపదికన క్వారంటైన్ కేంద్రాలను నిర్మిస్తోంది. ఇప్పటికే షిజియాజ్ హువాంగ్లో ప్రత్యేక సౌకర్యాలతో 3,000 క్వారంటైన్ గదుల నిర్మాణం చేపట్టగా.. హెబీ రాష్ట్రంలోనూ అదే తరహా ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చేస్తోంది.
చైనా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వైరస్ కేసులు భారీగా పెరిగే అవకాశమున్నందున ఆ దేశం ఇలా సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ఉత్తర చైనాలోని షిజియాజ్ హువాంగ్లో సకల సౌకర్యాలు అందుబాటులో ఉండేలా.. మొత్తం 34.02 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ క్వారంటైన్ కేంద్రాలను నిర్మిస్తోంది చైనా. ఒక్కో ఇల్లు సుమారు 18 చదరపు మీటర్ల వైశ్యాలంతో ఉండేలా.. శరవేగంగా నిర్మాణాలు చేపడుతోంది.
ఆ ప్రాంతంలో ఈ నెల 2 నుంచి ఇప్పటివరకు మొత్తం 706 కరోనా కేసులు వెలుగుచూశాయి. వారిలో 202 మంది వైరస్ లక్షణాలతో ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చదవండి: వెళ్తూ వెళ్తూ.. చైనాకు షాకివ్వనున్న ట్రంప్!