ETV Bharat / international

రంజాన్​కు కరోనా సెగ- పాక్​కు పట్టని వ్యథ

author img

By

Published : May 24, 2020, 4:25 PM IST

Updated : May 24, 2020, 9:12 PM IST

కరోనా ఆంక్షలు, వైరస్ భయాల మధ్యే ప్రపంచవ్యాప్తంగా రంజాన్ సంబరాలు నిర్వహించుకున్నారు ముస్లింలు. మహమ్మారి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన నేపథ్యంలో పలు దేశాల్లో రంజాన్ శోభ లేకుండా పోయింది. పాకిస్థాన్​, ఇండోనేసియా మాత్రం బహిరంగ వేడుకలు నిర్వహించుకున్నాయి. భౌతిక దూరం పాటించకుండా వేలాది మంది ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ramdan
రంజాన్

రంజాన్​కు కరోనా సెగ- పాక్​కు పట్టని వ్యథ

ప్రపంచవ్యాప్తంగా వైరస్ భయాలు, లాక్​డౌన్ ఆంక్షల మధ్య రంజాన్ జరుపుకుంటున్నారు ప్రజలు. చాలా వరకు ప్రభుత్వాలు మసీదుల్లో ప్రార్థనలపై నిషేధం విధించడం వల్ల ఇళ్లలోనే వేడుకలు నిర్వహించుకుంచుటున్నారు.

అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేసియా, టర్కీ, ఇరాన్, జోర్డాన్​ దేశాల్లో ఇప్పటికే వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ రంజాన్​ను జరుపుకుంటున్నారు. లాక్​డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన ప్రాంతాల్లోనూ ప్రజలు బయటకు రావడానికి వెనకాడుతున్నారు.

అయితే సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ఇండోనేసియాలోని అచేహ్ రాష్ట్రంలో మాత్రం బహిరంగ వేడుకలు నిర్వహించుకున్నారు ప్రజలు. ఇస్లామిక్ చట్టం అమలులో ఉన్న ఈ రాష్ట్రంలోని ప్రజలు.. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

మలేసియాలో రంజాన్​ రోజు వేల మందితో కలిసి నిర్వహించుకునే ఓపెన్ హౌస్ సంప్రదాయాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. 20 మందికి మించకుండా ఇంట్లోనే ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచించింది. మసీదుల్లో ఒకసారి 30 మంది మాత్రమే ప్రార్థనల్లో పాల్గొనాలని స్పష్టం చేసింది.

వైరస్ ప్రబలుతున్నా వేల మందితో...

కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలోనే పాకిస్థాన్​లో భారీ స్థాయిలో ఈద్ నిర్వహించుకున్నారు ప్రజలు. ప్రార్థనా స్థలాలను మూసేయాలన్న వైద్య నిపుణుల సూచనలను బేఖాతరు చేస్తూ.. మసీదులను తెరిచే ఉంచింది ఇమ్రాన్ ప్రభుత్వం. దీంతో పెద్ద సంఖ్యలో ముస్లింలు ఒకే చోట చేరి ప్రార్థనలు చేశారు. వ్యక్తిగత దూరం పాటించకుండా వేడుకలు చేసుకున్నారు. కరాచీలో జరిగిన బహిరంగ ప్రార్థనలో వెయ్యి మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు.

https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7328480_vlcsnap-2020-05-24-15h54m04s826-3.jpg
కరాచీలో సామూహిక రంజాన్ ప్రార్థనలు

కరాచీ ప్రార్థనలో పాల్గొన్న వెయ్యి మందికి పైగా ముస్లింలు

కరాచీలో వ్యక్తిగత దూరం పాటించకుండానే ప్రార్థనలు

నెలవంక కనిపించే విషయంలో రెండు వర్గాల మధ్య భేదాభిప్రాయాలు ఇప్పటివరకు పాకిస్థాన్​లో రెండు రోజుల పాటు రంజాన్ వేడుకలు జరుపుకుంటుండగా... తాజాగా ఆ ఆనవాయితీకి స్వస్తి పలికారు. తొలిసారి ఒకే రోజున రంజాన్ వేడుకలు చేసుకున్నారు.

మసీదులోకి అనుమతించాలని...

రంజాన్ పర్వదినాన పెద్ద ఎత్తున ప్రార్థనలు జరిగే జెరూసలేంలోని అల్​ అక్సా మసీదు లాక్​డౌన్ కారణంగా వెలవెలబోయింది. ప్రార్థనలకు అనుమతించాలని కొంతమంది మసీదు ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో ఇద్దరు వ్యక్తులను ఇజ్రాయెల్ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

జేరుసలేంలోని అల్​ అక్సా మసీదు ఎదుట ముస్లింల సందడి

అల్​ అక్సా మసీదు ఎదుట ముస్లింల ప్రార్థన

రంజాన్ నేపథ్యంలో అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు మూడు రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించారు. ఇరాన్​లో సామూహిక ప్రార్థనలకు అనుమతించిది ఆ దేశ ప్రభుత్వం. అయితే రాజధాని టెహ్రాన్​లో మాత్రం ఆంక్షలు కొనసాగించింది. ఇరాక్​లో సంపూర్ణ లాక్​డౌన్ ఉండటం వల్ల దేశంలో రంజాన్ కళ తప్పింది.

ఇరాన్​లో ముస్లింల ప్రార్థనలు
muslims-celebrate-major-holiday-amid-curfews-virus-fears
ఇరాక్​లో ఖాళీగా ఉన్న మసీదు

ఇదీ చదవండి: అబ్బే.. మాకు, కరోనా​కు సంబంధమే లేదు: వుహాన్​ ల్యాబ్​

ఇదీ చదవండి: పాకిస్థాన్​లో కరోనా విలయతాండవం

Last Updated : May 24, 2020, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.