కర్తార్‌పుర్‌లో గురుద్వారా సాహిబ్‌ను దర్శించుకునేందుకు పాస్‌పోర్ట్ అవసరం లేదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రకటించారు. ఏదైనా ఒక గుర్తింపు పత్రం చూపిస్తే సరిపోతుందని తెలిపారు.
"భారత్‌నుంచి కర్తార్‌పుర్ వచ్చే యాత్రికుల కోసం రెండు అంశాల నుంచి మినహాయింపు ఇచ్చాం. మొదటిది.. పాస్‌పోర్టు అవసరం లేదు. ఏదైనా ఒక గుర్తింపు పత్రం సరిపోతుంది. రెండవది.. 10 రోజుల ముందు పేరు నమోదు చేసుకునే అవసరం లేదు. అంతేకాకుండా నడవా ప్రారంభోత్సవం నాడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా ఎలాంటి రుసుము వసూలు చేయం."
-ఇమ్రాన్ ఖాన్, పాక్ ప్రధాని
కర్తార్‌పుర్ నడవా భారత్‌లోని డేరా బాబా నానక్ నుంచి దర్బార్ గురుద్వారా సాహిబ్‌ను కలుపుతుంది. ఈ ప్రాంతం అంతర్జాతీయ సరిహద్దు నుంచి కేవలం 4 కిలోమీటర్లు ఉంటుంది.
నడవా ఒప్పందం
కర్తార్‌పుర్ నడవా ఒప్పందంపై భారత్-పాక్ గతవారం సంతకం చేశాయి. వీసా రహిత ప్రయాణానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే యాత్రికులు 20 డాలర్ల చొప్పున సేవా రుసుం చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 5వేల మందిని మాత్రమే అనుమతి ఇస్తారు.
ఇదీ చూడండి: 'నా పేరు మధ్యప్రదేశ్.. నా కొడుకు పేరు భోపాల్'