ETV Bharat / international

భారతీయులకు సారీ చెప్పిన ఆ దేశ ప్రధాని కుమారుడు - Netanyahu's son apologises after his tweet offends Indians

అనుచిత మీమ్​ను షేర్​ చేసి విమర్శలు ఎదుర్కొన్న ఇజ్రాయెల్ ప్రధాని కుమారుడు.. తాజాగా క్షమాపణలు చెప్పారు. అవగాహన లేకపోవడం వల్లే ట్వీట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇందుకు క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొన్నాడు.

Netanyahu's son apologises after his tweet offends Indians
భారతీయులకు క్షమాపణలు చెప్పిన నెతన్యాహు!
author img

By

Published : Jul 28, 2020, 2:08 PM IST

భారతీయులను ఉద్దేశించి చేసిన ట్వీట్​పై దుమారం చెలరేగడం వల్ల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కుమారుడు యైర్ నెతన్యాహు క్షమాపణలు చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్​గా ఉండే 29 ఏళ్ల యైర్.. తన తండ్రి అవినీతి ఆరోపణల కేసులో ప్రాసిక్యూటర్ అయిన లియాత్ బెన్ అరీ ముఖాన్ని ఓ దేవత ఫొటోకు జతచేసి పోస్ట్ చేశారు. యైర్ ట్వీట్​ను భారతీయ నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు.

దీంతో స్పందించిన యైర్ నెతన్యాహు.. తన తప్పును తెలుసుకున్నట్లు చెప్పారు.

"ఇజ్రాయెల్​లోని రాజకీయ నేతలను విమర్శించే వ్యంగ్య పేజీ నుంచి ఈ మీమ్​ను ట్వీట్ చేశాను. హిందూ విశ్వాసానికి సంబంధించిన చిత్రం కూడా మీమ్​లో ఉన్నట్లు గ్రహించలేదు. కామెంట్ల రూపంలో భారతీయ స్నేహితులు తమ అభిప్రాయాలు చెప్పిన తర్వాత.. ట్వీట్​ను తొలగించాను. నేను క్షమాపణలు కోరుతున్నాను."

-యైర్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని కుమారుడు

క్షమాపణ చెప్పడంపై కొందరు ఇజ్రాయెల్ పౌరులు యైర్​ను ప్రశంసించారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఇంకొందరు విమర్శిస్తున్నారు.

ఇదీ చదవండి: దేశంలో తొలి డ్రోన్ శిక్షణ స్కూల్​ అక్కడే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.