ETV Bharat / international

ఓలిని పార్టీ నుంచి తొలగించిన ఎన్​సీపీ - Nepal political crisis news updates

నేపాల్​ ఆపధర్మ ప్రధాని కేపీ శర్మ ఓలిని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్​సీపీ) నుంచి తొలగించింది పార్టీ అధిష్ఠానం. ఓలి తీసుకున్న నిర్ణయాలపై పార్టీ స్టాండింగ్​ కమిటీ ముందు వివరణ ఇవ్వడంలో విఫలమవడం వల్ల పార్టీ నుంచి తొలగించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

Nepal's Caretaker PM KP Sharma Oli removed from ruling Nepal Communist Party
ఓలిని పార్టీ నుంచి తొలగించిన ఎన్​సీపీ
author img

By

Published : Jan 24, 2021, 8:19 PM IST

Updated : Jan 24, 2021, 9:39 PM IST

నేపాల్​లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. దేశ ఆపధర్మ ప్రధాని కేపీ శర్మ ఓలిని అధికార నేపాల్​ కమ్యూనిస్టు పార్టీ(ఎన్​సీపీ) నుంచి తొలగించింది పుష్ప కమల్​ ప్రచండ నేతృత్వంలోని పార్టీ అధిష్ఠానం. ఇటీవల ఓలి తీసుకున్న నిర్ణయాలపై స్టాండింగ్​ కమిటీ వివరణ కోరగా.. అందులో విఫలమైనందున పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ మేరకు బలూవతార్‌లోని ప్రధాని నివాసానికి ఓ లేఖను పంపింది.

పార్లమెంట్​ రద్దు అనంతరం ఓలిని ఛైర్మన్​ పదవి నుంచి తొలగించిన పార్టీ అధిష్ఠానం.. తాజాగా జరిగిన సమావేశంలో పూర్తిగా పార్టీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

పార్టీలో అంతర్గత విభేదాలతో చీలిక ఏర్పడింది. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో పార్లమెంట్​ను రద్దు చేశారు ఓలి. అప్పటినుంచి ఆపధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారు.

ఇదీ చూడండి: 'ఏ నిబంధనతో పార్లమెంట్​ను రద్దు చేశారు?'

Last Updated : Jan 24, 2021, 9:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.