మృతుల్లో ఎక్కువమంది గోడలు కూలి, ఇంటి నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలు కూలి, చెట్లు, విద్యుత్ స్తంభాలు మీదపడి చనిపోయారు. సోమవారం ఉదయం తుఫాన్ తీవ్రత తగ్గినందున హెలికాఫ్టర్ల సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
వేగంగా వీచిన గాలుల ప్రభావంతో హైవేపై ఉన్న కార్లు, 40 మందితో వెళ్తున్న బస్సు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బారా, పర్శా జిల్లాలపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిందని అధికారులు ప్రకటించారు.
ఈ తుఫాన్లో మొత్తం 400 మందికి గాయాలైనట్లు ప్రధాని కేపీ శర్మ ఓలి ట్విట్టర్లో ప్రకటించారు. మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.