ETV Bharat / international

నేపాల్​ కొత్త మ్యాపునకు ఆమోదం లాంఛనమే! - నేపాల్

నేపాల్​ రూపొందించిన వివాదాస్పద జాతీయ పటాన్ని ఆమోదించేందుకు ఆ దేశ పార్లమెంటు ప్రత్యేకంగా భేటీ అయింది. ఇప్పటికే ప్రతిపక్షాలు మద్దతు తెలిపిన నేపథ్యంలో బిల్లు ఆమోదం లాంఛనమే కానుంది.

Nepal
నేపాల్
author img

By

Published : Jun 13, 2020, 3:34 PM IST

రాజ్యాంగ సవరణ బిల్లు కోసం నేపాల్​ పార్లమెంటు శనివారం ప్రత్యేకంగా భేటీ అయింది. భారత సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలను కలుపుతూ రూపొందించిన కొత్త మ్యాపును ఆమోదించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టింది నేపాల్ ప్రభుత్వం. ఇప్పటికే ఈ బిల్లుపై చర్చించిన సభ్యులు శనివారం ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది.

పార్టీల ఏకాభిప్రాయం..

జాతీయ పటం ఆమోదం కోసం నేపాల్​ రాజ్యాంగంలోని షెడ్యూల్​ 3కు సవరణ చేయాల్సి ఉంది. ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ సహా జనతా సమాజ్​వాదీ పార్టీ ప్రకటించాయి. ఏకాభిప్రాభియం ద్వారా బిల్లును ఆమోదిస్తామని ఓ సీనియర్ మంత్రి చెప్పారు. కొత్త జాతీయ పటాన్ని అమల్లోకి తీసుకొచ్చే బిల్లు ప్రతిపాదనను జూన్ 9 న పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఆమోదం లాంఛనమే..

275 మంది ఉన్న దిగువ సభలో ఈ బిల్లు ఆమోదం పొందటానికి మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ఇక్కడ ఆమోదం లభిస్తే జాతీయ అసెంబ్లీకి బిల్లు వెళుతుంది. అక్కడా అధికార పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్న నేపథ్యంలో బిల్లు పాసవ్వటం లాంఛనమే అని తెలుస్తోంది. అనంతరం ధ్రువీకరణ కోసం రాష్ట్రపతికి సమర్పిస్తారు. ఆయన ఆమోదముద్రతో రాజ్యాంగ సవరణ ప్రక్రియ పూర్తవుతుంది.

టాస్క్​ఫోర్స్​ ఏర్పాటు..

బిల్లులో ప్రతిపాదించిన ప్రాంతాలకు సంబంధించిన చారిత్రక వాస్తవాలు, ఆధారాలను సేకరించడానికి ప్రభుత్వం తొమ్మిది మంది సభ్యుల నిపుణుల బృందాన్ని బుధవారం ఏర్పాటు చేసింది. మ్యాపును కేబినెట్​ ఆమోదించాక మళ్లీ టాస్క్​ఫోర్స్​ ఏర్పాటు ఎందుకంటూ దౌత్యవేత్తలు, నిపుణులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇదీ జరిగింది..

మూడు దేశాల సరిహద్దులు కలిసే లిపులేఖ్​లో​ భారత్​ రహదారి ప్రారంభించడాన్ని నేపాల్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇందుకు ప్రతిగా లిపులేక్, కాలపానీ, లింపియాధురా ప్రాంతాలను తమ భూభాగాలు చూపిస్తూ కొత్త జాతీయ పటాన్ని రూపొందించింది.

ఇదీ చూడండి: 'దౌత్య చర్చలతోనే కాలపానీ సమస్యకు పరిష్కారం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.